అంబేద్కర్ విగ్రహం ధ్వసం చేసిన కేసులో 5 గురిని అరెస్ట్ చేసిన కోటనందూరు పోలీసులు కోటనందూరు: గత నాలుగు రోజుల క్రితం కోటనందూరు మండలం పాత కొట్టాం గ్రామంలో గల 3 రోడ్డుల జంక్షన్ వద్ద గల ఆంబేద్కర్ విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని దుండగులు పగులగొట్టిన సంఘటనలో తూర్పు గోదావరి జిల్లా ఎస్పి నయీం అస్మి సత్వర ఆదేశాల మేరకు పెద్దాపురం డిఎస్పి ఆరిటాకుల శ్రీనివాసరావు పర్యవేక్షణ లో […]
latest east godavari news
భూ కబ్జాదారుల చేతుల్లో12 ఏకరాలుసర్పవరం భావనారాయణ స్వామి అన్యాక్రాంతంకాకినాడ రూరల్: సర్పవరం భావనారాయణ స్వామి గుడి సంబంధించిన వేలకోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. దీనిపై పత్రికల్లో వస్తున్న వార్తల నేపథ్యంలో శనివారం ఆలయ కమిటీ చైర్మన్ పుల్ల శేషు కుమారి మీడియా సమావేశం నిర్వహించారు. ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రామప్రజలకు.నాయకులు దన్యవాదాలు తేలిపిన కమిటీ దేశంలో ప్రాచీనమైన ఆలయాల్లో ఓకటి శ్రీ భావన్నారయణ స్వామి ఆలయమని, ఈ ఆలయానికి […]
విశాఖ ఉక్కు పరిశ్రమ కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్… మూతబడిన కాకినాడ సీ పోర్ట్, పాల్గొన్న స్కీం వర్కర్లు, దళిత సంఘాలుస్వచ్చందంగా బంద్ పాటించిన వ్యాపారవర్గాలుమూతబడిన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, బ్యాంకులుమధ్యాహ్నం వరకు ఆగిన ఆర్టీసీ కాకినాడ, మార్చి 5; విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఇచ్చిన పిలుపు రాష్ట్ర బంద్ జిల్లాలో విజయవంతమయ్యింది.కేంద్ర కార్మిక సంఘాలు, విద్యార్థి, యువజన, దళిత సంఘాలు, వామపక్ష పార్టీలు ముందుండి […]
కాకినాడ : అఖిల భారత రాష్ట్ర ఉద్యోగుల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వఉద్యోగులు శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ ఎదుట భోజనవిరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు.ఈసందర్భంగా ఏపీ ఎన్జీవో జిల్లా శాఖ అధ్యక్షకార్యదర్శులు జి. రామమోహన్ రావు, మూర్తి బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసిన డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఐదు సంవత్సరాలకు అన్ని రాష్ట్రాలలో పీఆర్సీ అమలుచేయాలన్నారు. […]
3 పర్యాయాలు కైకవోలు సర్పంచ్ గా విశిష్ట సేవలుదళిత వాడల ప్రగతికి అంకిత సేవలు(వారధి బ్యూరో, కాకినాడ)మూడు తరాలకు పైగా గ్రామ సర్పంచ్ గా విశిష్ట సేవలందించి సంపర నియోజక వర్గం లోని ఓ కుగ్రామానికి గుర్తింపు తీసుకురావడమే కాకుండా తన శేష జీవితాన్ని బడుగులకు అందించిన మహోన్నత మూర్తి ముప్పిడి నాగన్న(105). పెదపూడి మండలం లోని ఓ మారుమూల పల్లె అయిన కైకవోలు కుగ్రామంలో ముప్పిడి మాతల్లి, అప్పయ్యమ్మ […]
కాకినాడ రూరల్ : పుష్యమాసం అమావాస్య పర్వదినం సందర్భంగా కాకినాడ రూరల్ చొల్లంగి గ్రామంలో ” చొల్లంగి అమావాస్య తీర్థం ” గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పురాణ ప్రసిద్ధి గాంచిన సప్తసాగర సంగమ తీరాన 1912సంవత్సరంలో మహాదాత మల్లాడి సత్యలింగం నాయకర్ మరణశాసనం(వీలునామా)అనుసరించి నాటి ధర్మకర్తలు దురిశేటి శేషగిరిరావు పంతులు, నాయకర్ పుత్రులు మల్లాడి సుబ్రహ్మణ్య నాయకర్ సాగరతీరాన శ్రీ బాలాత్రిపురసుందరి సమేత సంగమేశ్వర స్వామి, శ్రీ సీతారామస్వామి, శ్రీ […]
పీవోలు, ఏపీవోలకు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి దిశానిర్దేశం కాకినాడ: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో క్షేత్రస్థాయిలో కీలకపాత్ర పోషించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉంటుందని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన 767 మంది ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి హాజరయ్యారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసేందుకు […]
సర్పంచ్ అభ్యర్థి భర్త అనుమానాస్పద మృతిసీఐ, ఎస్ఐలను వీఆర్ కు పంపాలని ఆదేశాలుకేసును ఎస్పీ స్వయంగా దర్యాప్తు చేస్తారని వ్యాఖ్య కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంట సర్పంచి అభ్యర్థి పుష్పవతి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఈ ఘటనను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సీరియస్ గా తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన గొల్లలగుంటకు వెళ్లారు. పుష్పవతి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన స్థానిక పోలీసులపై చర్యలకు ఉపక్రమించారు. […]
కరప(తూర్పుగోదావరి): తమ పార్టీకి చెందిన నాయకులపై వైసిపి మంత్రులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కరప పోలీస్‌స్టేషన్‌లో టిడిపి కాకినాడ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పిల్లి సత్తిబాబు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిలు గురువారం ఫిర్యాదు చేశారు. నాయకులు కార్యకర్తలతో కలసి వెళ్లి ఎస్సై డి.రామారావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పిల్లి సత్తిబాబు మాట్లాడుతూ.. తమ పార్టీ అధినేతలపై విచక్షణారహితంగా ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ […]
కాకినాడ సిటి : సావిత్రి బాయ్ పూలే నేటి సమాజానికి ఆదర్శమని ఐద్వా గౌరవ అధ్యక్షురాలు ఎం వీరలక్ష్మి పేర్కొన్నారు. స్థానిక పాతబస్టాండ్ లో ఐద్వా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సావిత్రి బాయ్ పూలే 190 వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ నాయకులు జె శ్రీ సూర్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎం వీరలక్ష్మి మాట్లాడుతూ ఈనాడు మహిళలు చదువుకుని ఉన్నత శిఖరాలను అవరోధిచారంటే సావిత్రి […]