న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి చెలరేగిపోతోంది. రోజురోజుకు మరింతగా విజృంభిస్తూ మరణ మృదంగం మోగిస్తోంది. మంగళవారం దేశంలో రికార్డ్ స్థాయిలో 2 లక్షల 95 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలు 2 వేలు క్రాస్ అయ్యాయి. కరోనా దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి, మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా 2023 మందిని వైరస్‌ బలితీసుకుంది. […]

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకూ ఎగబాకుతున్నాయి. రాష్ట్రంలో గత 24గంటల్లో 35,922 నమూనాలు పరీక్షించగా 6,582 కేసులు బయటపడ్డాయి. 22 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,62,037కు చేరుకోగా.. మరణాల సంఖ్య 7,410కి పెరిగింది. తాజాగా 2,343 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 44,686 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 9,09,941 మంది రికవరీ అయ్యారని వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది.

చెన్నై: కరోనా వ్యాప్తి తీవ్రత దీష్ట్యా.. మహమ్మారిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంట్లో భాగంగా ప్రతి ఆదివారం పూర్తి లాక్‌డౌన్‌తో పాటు మిగతారోజుల్లో రాత్రి 10 నుంచి ఉదయం 4వరకు కర్ఫ్యూ విధించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

కాకినాడ: జిల్లా స్థాయిలో కొవిడ్ సేవలను పర్యవేక్షణ నిమిత్తం కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన కొవిడ్ కంట్రోల్ రూమ్ ను శనివారం ఉదయం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి సందర్శించారు. ఈ సందర్భంగా జేసి కీర్తి చేకూరి కంట్రోల్ రూమ్ లో ఉన్న హోం క్వారంటైన్, హోంఐసోలేషన్, ఆరోగ్యశ్రీ, సీసీటీవీ ద్వారా కొవిడ్ ఆసుపత్రుల పర్యవేక్షణ, కొవిడ్ టీకా,108,104, ఇతర విభాగాలకు […]

ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణఅమరావతి: ఏపీలో గడచిన 24 గంటల్లో కరోనా ఉద్ధృతి మరింత పెరిగింది. 31,892 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,765 కొత్త కేసులు వెలుగు చూశాయి. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పోటాపోటీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో 496 కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 490 కేసులు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 341, విశాఖ జిల్లాలో 335, నెల్లూరు జిల్లాలో 292 పాజిటివ్ కేసులు […]

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా నుంచి తమిళనాడు ఎన్నికల విధులకు వెళ్లిన పోలీసు సిబ్బందిలో 10మందికి కరోనా సోకింది. 50 మంది పోలీసులు అంతా ఒకే బస్సులో ప్రయాణం చేశారు. వారిలో 6గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మిగిలిన సిబ్బంది ఎన్నికల విధులకు హాజరవుతున్నారు. అలాగే పోలవరంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నఓ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల తమిళనాడు ఎన్నికలకు 367 మంది పోలీసులు వెళ్ళారు.

కాకినాడ: కోవిడ్ సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్న నేపద్యంలో జిల్లాలో మాస్క్ ధారణ ప్రతి ఒక్కరూ తప్పని సరిగా పాటించాలని, మాస్క్ లేకుండా సంచరించే వారి కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి స్పష్టం చేసారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ కోర్టు హాలులో కోవిడ్-19 నివారణపై ఏర్పాటైన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా […]

సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్‌తో రానున్న శాంసంగ్ గేలక్సీ F62 కరోనా వైరస్ ఇండియా నుంచి పూర్తిగా తొలగిపోలేదు. అది ఒకరి నుంచి మరొకరి వ్యాపించకుండా అరికట్టాలంటే.. వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే వ్యాక్సిన్ ప్రక్రియ మొదలుపెట్టింది. ముందుగా దీన్ని వైద్యులు, హెల్త్ వర్కర్లు, అత్యవసర సేవలు అందించే సిబ్బందికి అందిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్ రూపొందించిన ‘కొవాగ్జిన్’ కరోనా టీకాకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి […]

​అలాంటి చికిత్సల వల్లే వైరస్పై రోగనిరోధక ఒత్తిడి బ్రిటన్ స్ట్రెయిన్ అలా ఏర్పడిందే! చాలా దేశాలకు ‘బ్రిటన్ కరోనా’ పాకేసింది. మన దేశానికీ అది వచ్చేసింది. దానితో ఎక్కువ ప్రమాదం లేదని ప్రభుత్వం, నిపుణులు చెబుతున్నా.. అది సోకే వేగమే ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. అయితే, వైరస్లో ఇలాంటి జన్యుమార్పులకు కారణం తప్పుడు వైద్యమేనని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) హెచ్చరిస్తోంది. ప్రస్తుతం కొవిడ్కు సంబంధించినంత వరకు తప్పుడు […]

హైదరాబాదు:  తెలంగాణలో కొత్తగా 573 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,77,724 కు పెరిగింది. నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా 47,186 నమూనాలను పరీక్షించారు.తాజాగా కరోనా నుంచి 609 మంది కోలుకోగా ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 2,68,601 కు చేరుకుంది. మరో నలుగురు కొవిడ్‌తో మృతిచెందగా.. మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 1493 కు చేరుకుంది .

Translate

Translate »