అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకూ ఎగబాకుతున్నాయి. రాష్ట్రంలో గత 24గంటల్లో 35,922 నమూనాలు పరీక్షించగా 6,582 కేసులు బయటపడ్డాయి. 22 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,62,037కు చేరుకోగా.. మరణాల సంఖ్య 7,410కి పెరిగింది. తాజాగా 2,343 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 44,686 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 9,09,941 మంది రికవరీ అయ్యారని వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది.

అమరావతి: మాజీ మంత్రి దేవినేని ఉమకు మరోసారి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గొల్లపూడిలోని ఉమ నివాసానికి రెండోసారి నోటీసులు అంటించారు. ఈనెల 19న కర్నూలు సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. 15న దేవినేనికి మొదటి నోటీసు ఇచ్చారు. అప్పుడు దేవినేని ఉమ.. తనకు 10 రోజులు సమయం కోరారు. సీఎం జగన్‌ మాటలను వక్రీకరించారన్న న్యాయవాది ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు […]

ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణఅమరావతి: ఏపీలో గడచిన 24 గంటల్లో కరోనా ఉద్ధృతి మరింత పెరిగింది. 31,892 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,765 కొత్త కేసులు వెలుగు చూశాయి. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పోటాపోటీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో 496 కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 490 కేసులు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 341, విశాఖ జిల్లాలో 335, నెల్లూరు జిల్లాలో 292 పాజిటివ్ కేసులు […]

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష టీడీపీ అయోమయంలో పడిపోయింది. ఇక ఆ తర్వాత సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ కూడా టీడీపీకి మరింత సమస్యగా తీసుకొచ్చాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా దూసుకుపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలోనే టీడీపీ పార్టీకి చెందిన నేతలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధమయ్యారు. అయితే ఎలక్షన్లో గెలవగానే ఇక పదవికి రాజీనామా చేస్తే తప్ప ఇతర పార్టీలో చేరడానికి వీలు లేదు అంటూ […]

అమరావతి, విశాఖ: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని. ప్రజలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావారణ శాఖ కార్యాలయంలో గురువారం ప్రత్యేకంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ శాఖ డైరక్టర్‌ ఎస్‌. స్టెల్లా ఈ విషయం తెలిపారు. . దక్షిణ అండమాన్‌ సముద్రంలో నెలకొన్న తుఫాన్‌ ప్రభావం కారణంగా వాతావరణంలో పలు మార్పులు జరుగుతున్నాయని చెప్పారు. దీనిలో భాగంగానే ఉత్తర దిశ నుండి […]

‘ఒక్క ఛాన్స్’లో మీడియా సహకారం లేదా? సీఎం జగన్‌ను సూటిగా ప్రశ్నించిన ఎన్.ఎ.ఆర్.ఎ. ‘‘కృతజ్ఞతాభావం అంటే ఏమిటి? అమరావతి: మీరు మీ కళ్ళను బాగా తెరిచి మీ చుట్టుపక్కల ఉన్న జీవితాన్ని చూస్తే, మీ జీవితంలో మిగతావాటి ప్రమేయాన్ని మీరు స్పష్టంగా చూస్తే, కృతజ్ఞతాభావం కలగకుండా మానదు. మీ ఎదురుగా పళ్ళెం నిండా ఆహారం ఉందనుకుందాం. ఆ ఆహారం మీ పళ్ళెంలో ఉండడానికి ఎంతమంది పని చేసుంటారో మీకు తెలుసా? […]

శ్రీకాకుళం, చిత్తూరు, ప్రకాశం మినహా తెదేపా అన్ని చోట్ల అడపా దడపా అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ రోజు(మంగళవారం)మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరగ్గా, అనంతరం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. పార్టీల మద్దతుతో గెలిచిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పటివరకూ ఓవరాల్‌గా వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులు 1130 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 76 చోట్ల గెలుపొందారు.బీజేపీ మద్దతుదారులు 2, […]

అమరావతి : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ప్రధాని మోడీకి ఎపి సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శనివారం లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని లేఖలో కోరారు. ప్లాంట్‌ను బలోపేతం చేయడానికి మార్గాల్ని అన్వేషించాలని పేర్కొన్నారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 20 వేల మంది ప్రత్యక్షంగా, వేలాది మంది పరోక్షంగా జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాద వేదికగా ప్రజల […]

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఎస్‌ఈసీ తయారు చేసిన యాప్‌నకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ నుంచి సెక్యూరిటీ సర్టిఫికేషన్ వచ్చేంతవరకు, ఈ యాప్‌‌ వినియోగాన్ని నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ- వాచ్‌ పేరుతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఓ యాప్‌ను విడుదల చేశారు. దీని ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు.అయితే ప్రైవేటు యాప్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ […]

Translate

Translate »