కడప: జిల్లా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు మూడోరోజు కొనసాగుతోంది. మంగళవారం కూడా పలువురిని ప్రశ్నించనుంది. గత మూడు రోజులుగా సీబీఐ విచారణ జరుపుతోంది. మొదటి రోజు కడపలో విచారణ జరిపిన సీబీఐ తర్వాత పులివెందులలో వివేకా కుటుంబ సభ్యులను అధికారులు విచారించారు. ఇవాళ కూడా మరోసారి వివేకా కుటుంబసభ్యులను విచారించారు. అలాగే వివేకా హత్య జరిగినరోజు ఆ ఇంట్లో ఉన్న వాచ్‌మెన్ రంగయ్య, పీఏ గంగిరెడ్డి […]

➖ఫరంట్‌లైన్ వారియ‌ర్స్‌గా గుర్తించాలి ➖ఏపీజేఎఫ్ క‌డ‌ప శాఖ డిమాండ్‌ ➖కవిడ్ తో మృతి చెందిన జ‌ర్న‌లిస్టుల‌కు నివాళి క‌డ‌ప (వారధి ప్రతినిధి): కొవిడ్ కార‌ణంగా ప్రాణాలు కోల్పోతున్న జ‌ర్న‌లిస్టుల‌కు రూ.50 ల‌క్ష‌ల ప‌రిహారాన్ని వ‌ర్తింప‌జేయాల‌ని ఏపీ జ‌ర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్య‌ద‌ర్శి భూమిరెడ్డి శ్రీ‌నాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భానుప్రకాష్ రాజు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. కొవిడ్ విధుల్లో ఉండే వైద్యులు, వైద్య సిబ్బంది, ఉద్యోగులు, పోలీసుల త‌ర‌హాలో జ‌ర్న‌లిస్టుల‌కు […]

వై.ఎస్.ఆర్. కడప: దివంగత మహానేత, మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజమమ్మ రాసిన “నాలో.. నాతో వైఎస్సార్‌” పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం ఆవిష్కరించారు. అంతకుముందు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద సీఎం జగన్‌ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘నాన్న జయంతిని పురస్కరించుకుని అమ్మ.. నాన్నను చూసిన విధంగా..”నాలో.. నాతో వైఎస్‌ఆర్‌” రచన చేశారు. గొప్ప రాజకీయ నేతగా అందరికీ పరిచయం అయిన […]

కడప: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ను హొం క్వారంటైన్ లో ఉండాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సీఎం పర్యటనకు దూరంగా ఉంచాలని ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేసారు. రేపటి నుంచి 28 రోజుల పాటు గృహ నిర్బందంలో డిప్యూటీ సీఎం ఉండనున్నారు. మరోమారు పరీక్షలు నిర్వహించనున్న అధికారులు..సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు‌, నేతలకు, పాత్రికేయులకు కరోనా టెస్ట్ లు నిర్వహించిన అధికారులు..టెస్టులో డిప్యూటీ సీఎం, ఆయన […]

కడప: జిల్లాలోని పులివెందులలో గ్రామ వాలంటీర్ పట్ల వైసీపీ నేత దారుణంగా వ్యవహరించారు. పెన్షన్ల పంపిణీలో తాను చెప్పినట్లు పనిచేయడం లేదని వాలంటీర్ గౌతమిపై వైసీపీ నేత రఘునాథ్ రెడ్డి చెప్పుతో దాడి చేశారు. దీంతో బాధితురాలు గౌతమి పోలీసుల‌ను ఆశ్రయించారు. తనపై దాడి చేసిన వైసీపీ నేతపై గౌతమి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Translate

Translate »