పెదవేగి: పశ్చిమ గోదావరిజిల్లా పెదవేగి మండలంలో ఒక పంచాయతీ కార్యదర్శి ని పంచాయతీరాజ్ కమీషనర్ సస్పెండ్ చేసి సరిగ్గా నెలరోజులైంది.ఆకార్యదర్శికి సస్పెండ్ ఆర్డర్ ఉత్తర్వ్ లు సర్వ్ చేయకుండా అధికారులు నెలరోజులుగా ఆడుతున్న హైడ్రామా జిల్లాలో రోజు రోజుకూ ఉత్కంఠత రేపుతోంది. సస్పెండ్ ఆర్డర్ సర్వ్ చేయవలసిన అధికారులు సస్పెండైన కార్యదర్శి సస్పెండ్ ఆర్డర్ పై కోర్టు స్టే తెచ్చుకునే వరకు కోవిడ్ సెలవు లలో ఉండే విధంగా ఆ […]

పశ్చిమగోదావరి: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్రమండలం పొలమూరు గ్రామ సచివాలయంలో కరోనా కలకలం సృష్టించింది. పొలమూరు గ్రామ సచివాలయంలో ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు తెలిపారు. బాధితులను తాడేపల్లిగూడెం కోవిడ్ ఆస్పత్రికి తరలించారు.

పశ్చిమగోదావరి: ఏలూరు సీఆర్‌ఆర్‌ కోవిడ్‌ సెంటర్‌ నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. జిల్లా జైల్లో ఖైదీలకు కరోనా సోకడంతో 13 మందిని కోవిడ్‌ కేంద్రానికి తరలించారు. వీరిలో పలు చోరీ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న ఇద్దరు ఖైదీలు ఇదే అదనుగా భావించి శనివారం తెల్లవారుజామున  సుమారు మూడుగంటల ప్రాంతంలో కోవిడ్‌ కేంద్రం నుంచి పరారయ్యారు. దీంతో ఏలూరు పోలీసులకు సిబ్బంది సమాచారం అందించారు. పరారీలో ఉన్న ఖైదీల కోసం పోలీసులు గాలింపు […]

పశ్చిమగోదావరి: జిల్లా లోని జీలుగుమిల్లిలో ఆదివారం సినీ ఫక్కీలో 268 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా సీలేరు నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న సమాచారంతో జీలుగుమిల్లి ఎస్సై విశ్వనాథబాబు తన సిబ్బందితో లక్ష్మీపురం వద్ద గస్తీ నిర్వహించారు. గంజాయి తరలిస్తున్న ట్రావెల్స్ బస్సును అడ్డుకోగా బస్సును ఆపకుండా వెళ్లిపోయారు. ఎస్సై తన వాహనంతో 10 కిలోమీటర్లు వెంబడించి బస్సును పట్టుకున్నారు. బస్సులో ప్రత్యేకంగా అమర్చిన 268 కిలోల […]

భీమవరం: వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఏపీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు రఘురామకృష్ణరాజుపై భీమవరం వన్ టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా ఫిర్యాదు చేశారు. తనతో పాటు తన పార్టీ సహచర ఎమ్మెల్యేలను రఘురామకృష్ణరాజు ‘పందులు’ అంటూ […]

వినుకొండ:- ప్రకాశం జిల్లా ముళ్ళమూరు నుంచి అక్రమంగా మద్యం సీసాలు తీసుకువస్తున్న యవకుడిని అదుపులోకి తీసుకుని ముఫ్పై మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు.

కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గామన్ ఇండియా టోల్ ప్లాజా దగ్గర బుధవారం ఉదయం నర్సీపట్నం నుండి తెలంగాణ వైపు ఏపీ 16 బిజె 6829 నెంబర్ గల టయోటా క్వాలిస్ లో గంజాయిని తరలిస్తుండగా పట్టణ పోలీసులు వల వేసి పట్టుకున్నారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొవ్వూరు డి.ఎస్.పి ఎస్. రాజేశ్వర రెడ్డి వివరాలు తెలియజేసారు. నామ్ దేవ్, […]

ప.గో. జిల్లా : ఏలూరు త్రీ టౌన్ పోలీసు స్టేషన్ సీఐ కి కరోనా పాజిటివ్ గా గుర్తించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ తో పాటు అతని కుటుంబం సభ్యులకు సోకిన కరోనా వైరస్ కారణంగా పోలీసులలో కలవరం మొదలయ్యింది. స్టేషన్ లో చేపట్టిన సూపర్ శానిటేషన్ పనులు, సిబ్బందికి కోవిడ్ టెస్ట్ లు చేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం వెల్లడించింది.

Translate

Translate »