ట్విట్టర్ లో అయ్యన్న విసుర్లు ఏ2 దొంగ రెడ్డీ అంటూ వ్యాఖ్యలు విశాఖపట్నం: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మరోసారి ధ్వజమెత్తారు. “ఏ2 దొంగ రెడ్డీ… బాబాయ్ గొడ్డలితో గుండెపై పొడుచుకున్నాడా? లేక మీరే గొడ్డలి వేటు వేశారా? ఓ చెల్లి తెలంగాణ రోడ్లపైనా, మరో చెల్లి ఢిల్లీలో అన్న కాదు అరాచకుడని నినదిస్తూ భయపెడుతున్నారా?” అంటూ ప్రశ్నించారు. “పంచాయతీలు, మున్సిపాలిటీలు […]

గ్రేటర్‌ విశాఖ : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ అంటే యంత్రాలు కాదు… కార్మికుల గుండె చప్పుడు… విశాఖ భవిష్యత్‌… తెలుగు ప్రజల ఆత్మగౌరవం… అలాంటి స్టీల్‌ప్లాంట్‌ను 100 శాతం అమ్మేయాలన్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యమిస్తున్న కార్మిక వర్గం.., ఉత్పత్తిని పెంచడంలోనూ అదే సంకల్పాన్ని ప్రదర్శిస్తోంది. నష్టాలవల్లే ప్రైవేటీకరణ చేస్తున్నామని బిజెపి ప్రభుత్వం చేస్తోన్న ప్రచారం అబద్ధమని కంపెనీ వార్షిక నివేదిక తేలతెల్లం చేస్తోంది. ఆర్‌ఐఎన్‌ఎల్‌ (విశాఖ స్టీల్‌ప్లాంట్‌) సిఎమ్‌డి […]

అమరావతి, విశాఖ: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని. ప్రజలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావారణ శాఖ కార్యాలయంలో గురువారం ప్రత్యేకంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ శాఖ డైరక్టర్‌ ఎస్‌. స్టెల్లా ఈ విషయం తెలిపారు. . దక్షిణ అండమాన్‌ సముద్రంలో నెలకొన్న తుఫాన్‌ ప్రభావం కారణంగా వాతావరణంలో పలు మార్పులు జరుగుతున్నాయని చెప్పారు. దీనిలో భాగంగానే ఉత్తర దిశ నుండి […]

గిరిజన మహిళ కుటుంబానికి గ్రానైట్ యాజమాన్యం 10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి రావికమతం: మండలం లోని ఎర్ర బంద సమీపంలో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కొట్నబిలి నుండి చిన్న పాసి ల్లీ గ్రామం నుండి వస్తున్న గ్రానైట్ లారీ కొట్నబిల్లి గ్రామం నుండి వస్తున్నబైక్ మీద వస్తూ ఎర్ర బండ గ్రామం సమీపంలో బైక్ మీద వస్తున్న రాజేశ్వరి గ్రానైట్ లారీ బైక్ను ఢీకొనడంత చక్రం కిందపడిపోయింది అక్కడికక్కడే […]

గాజువాక: జిహెచ్ఎంసి పరిధిలోని పెదగంట్యాడ 76 వార్డు నడుపూరు గాంధీ పార్క్ వద్ద శనివారం  వై ఎస్ ఆర్ సీపీ పార్టీ 10 వసంతాలు పూర్తిచేసికొని 11వ వసంతములో అడుగుపెడుతున్న సందర్బంగా 76 వార్డు వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల నడుమ  వార్డు కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి రమణ ఆధ్వర్యంలో దివంగత నేత డా. వైయస్ ఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి పాలాభిషేకం చేసారు. అనంతరం వృద్దులకు పళ్ళు […]

గాజువాక: జివి ఎం సి పరిధి అయిన 65 వార్డు రాజీవ్ మార్గ్ రోడ్ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కమిటీ ఆధ్వర్యంలో అన్నాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 76 వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి దొడ్డి రమణ సంతోష్ కుమారి పాల్గొని వారి చేతుల మీదుగా స్వామివారికి సుమారు 100 కేజీల అన్నం తో అన్నాభిషేకం చేశారు. అనంతరం దొడ్డి రమణ […]

విశాఖ‌: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను వందశాతం ప్రయివేటీకరణ చేసి తీరుతామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రకటించడాన్ని ఖండిస్తూ మంగళవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కమిటీ (అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల ఐక్య వేదిక) ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను కార్మిక సంఘాల నాయకులు దహనం చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ దహనం చేశారు. ఈ సందర్భంగా […]

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్‌ జరగనున్నది. ఇందుకోసం 98 వార్డుల్లో 1,712 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద విధుల నిర్వర్తించేందుకు సిబ్బంది నియామకం, వారికి శిక్షణ పూర్తిచేశారు. బ్యాలెట్‌ పేపర్లు, బాక్సులు, ఇతరత్రా పోలింగ్‌ సామగ్రిని నగరంలోని నాలుగు పంపిణీ కేంద్రాల్లో సిద్ధంగా ఉంచారు. వాటిని మంగళవారం […]

Translate

Translate »