ప్రకాశం (కొండపి) : కొండపి మండలం మిట్టపాలెంలోని ఎస్‌సి కాలనీలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని తొలగించేందుకు తమ సిబ్బందితో వచ్చిన రెవెన్యూ, పోలీసు అధికారులు శనివారం దళితులు అడ్డుకున్నారు. జాతీయ నాయకుని విగ్రహాన్ని తొలగించడానికి వీళ్లేదంటూ అడ్డగించడంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ విషయమై స్థానిక తహశీల్దార్‌, ఎస్సైలను వివరణ అడుగగా.. బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన స్థలం ప్రభుత్వ భూమి అని, […]

పాత సింగరాయకొండలో ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ రాష్ట్ర బృందం పర్యటన || బయటపడ్డ ఎన్నో అక్రమాలు

ఒంగోలు: సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ నరసింహస్వామి కొండ దిగువన ఉన్న ప్రయివేటు భూమి, సర్వేనెంబర్ 309/3లో దాదాపు 98 ఎకరాలలో గ్రావెల్ మాఫియా, గత సంవత్సరం రోజులుగా పై సర్వే నెంబర్ నందు దాదాపు పదిహేను అడుగుల లోతు వరకు గ్రావెల్ తవ్వి అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. దీనిపై పలుమార్లు మీడియాలో వార్తలు వచ్చినా, గ్రామ ప్రజలు గగ్గోలు పెడుతున్నప్పటికీ అధికారులెవరూ పట్టించున్న పాపాన పోలేదు .దీనిపై ప్రకాశం […]

ఒంగోలు: రాజకీయ పునరావాసంగా ప్రభుత్వ సలహాదార్ల వ్యవస్థ మారిందని ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రభుత్వ సలహాదారుల్లో బడుగు బలహీనవర్గాల వారేరని ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారులుగా ఎస్సీలకు అవకాశం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీల్లో విద్యావంతులు, మేధావులు లేరా అని నిలదీశారు. ఎస్సీ సలహాలు తీసుకోవడం చిన్నతనంగా భావిస్తున్నారా ప్రశ్నించారు. సలహాదార్ల వ్యవస్థ సలహాల కోసమా…లేక ముఖ్యమంత్రి కోసమా అని […]

చిన్నగంజాం మండలం (వారధి విలేకరి): మండలానికి చెందిన కీలకమైన రిజిస్టర్లు గల్లంతైనట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. రికార్డ్ ఆఫ్ సర్వే రైట్స్ (ఆర్ ఎస్ ఆర్) రికార్డును సమాచార హక్కు చట్టం కార్యకర్త ఆర్టీఐ ద్వారా కోరగా సదరు రికార్డు మాయమైనట్లు సమాచారంలో తెలిపారని మండలానికి చెందిన పెదగంజాం గ్రామం కె. ఏడుకొండలు యదార్థ గాధ ల సజీవ రూపం వారధి కి తెలిపారు. మండలానికి చెందిన రికార్డ్ ఆఫ్ […]

ప్రకాశం: కురిచేడులో శానిటైజర్‌ తాగి చనిపోయిన అనుగొండ శ్రీను బోయకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులో​కి వచ్చింది. మద్యానికి బానిసైన అతడు తనతో పాటు మరో వ్యక్తికి కూడా గ్లాసులో శానిటైజర్‌ పోసి ఇచ్చిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో కురిచేడులో పది రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో కొందరు స్థానికులు, యాచకులు శానిటైజర్‌ తాగారు. ఈ ఘటనలో గురువారం అర్ధరాత్రి ముగ్గరు […]

క్వాలిటీ లేని ఆహారాన్ని పెడుతున్నారంటూ మండిపాటు ఒంగోలు: ఒంగోలు లోని కరోనా క్వారంటైన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉదయం 11 గంటల వరకు తమకు టిఫిన్ కూడా పెట్టడం లేదని కరోనా అనుమానితులు ఆందోళన చేపట్టారు. తమకు అందిస్తున్న ఆహారం క్వాలిటీగా లేదని… పశువుకు వేసే ఆహారాన్ని తమకు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ ఆహారాన్ని తింటే వాంతులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పరీక్షలు చేయించుకుని వారం, […]

తహసీల్దార్ వేధింపు వేధింపులు సమాచారహక్కు చట్టం కార్యకర్తపై దాడి పినపాక(వారధి విలేఖరి): దరఖాస్తులన్నీ వెనుకకు తీసుకో లేకుంటే మా ఆఫీస్ వాళ్ళతోనీపై కేసులు పెట్టిస్తానని అవసరమైతే 100 మందిని కోర్టుకు తీసుకొచ్చి నీ మీద సాక్ష్యం చెప్పిస్తానని నన్ను బెదిరించారని ఒక విద్యార్థి తెలియజేశారు. తనకు జరుగుతున్న అన్యాయంగురించి పలుమార్లు నివేదిక ద్వారా ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి నప్పటికీ ఎటువంటి స్పందన లేదని అన్నారు. సమాచార హక్కు […]

ప్రకాశం జిల్లా: గిద్దలూరు మండలం ఓబులాపురం తండాలో అత్యంత దారుణం సంఘటన చోటు చేసుకుంది. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో తన ముక్కు పచ్చలారని మూడు సంవత్సరాల కుమారుడిని ప్రియుడు అల్లావల్లి తో కలిసి హతమార్చేందుకు తల్లి లక్ష్మీ బాయి ప్రయత్నించింది. నోరు మూసి ఊపిరాడకుండా చంపే యత్నం చేసింది. పసిబాలుడు కేకలు వేయడంతో ఈ సంఘటన స్థలానికి వచ్చిన స్థానికులు చేరుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. బాలుడికి […]

Translate

Translate »