అపోలో ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్యే నెల్లూరు: కరోనా వైరస్ భూతం అంతకంతకు విజృంభిస్తోంది. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు, క్రీడాకారులు, రాజకీయనేతలు కూడా దీని బారినపడుతున్నారు. ఏపీలోనూ అందుకు మినహాయింపు కాదు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కరోనా వైద్య పరీక్షలు చేయించుకోగా, వైరస్ సోకినట్టు ఫలితాల్లో వెల్లడైంది. తనకు పాజిటివ్ వచ్చిన విషయాన్ని కోటంరెడ్డి […]

నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలిలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురుపై కసాయి తండ్రి అత్యాచారం చేసిన ఘటన కావలిలోని తుఫాన్ నగర్‌లో జరిగింది. 14 సంవత్సరాల మైనర్‌పై కసాయి తండ్రి కోటేశ్వరరావు ఘాతుకానికి ఒడిగట్టాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. బాలికను చికిత్స నిమిత్తం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కావలి: నెల్లూరు జిల్లా కావలి సభ్యసమాజం తలదించుకునే సంఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కావలి డీఎస్పీ డి.ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. కావలిలోని తుఫాన్‌నగర్‌లో కోటేశ్వరరావు నివాసం ఉంటున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో నెల రోజుల క్రితం ఆమె తన పుట్టిళ్లు అయిన జలదంకి మండలం చామదలకు వెళ్లిపోయింది. దీంతో పిల్లలు తుఫాన్‌నగర్‌లోని నాన్నమ్మ వద్ద ఉంటుండగా, […]

నెల్లూరు: జిల్లాలో కరోనా వైరస్ దెబ్బకు ఏకంగా పోలీస్ స్టేషన్నే మూసేశారు. జిల్లాలోని వెంకటగిరి పోలీస్ స్టేషన్‌లో పనిచేసే దాదాపు అందరికీ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మొత్తం 11 మంది పోలీసులు, సిబ్బందికి వైరస్ సోకింది. ఇటీవలే ఓ హత్య కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి ద్వారానే పోలీసులందరికీ కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. అయింది. అలాగే స్వీపర్లకు సైతం వైరస్ సోకింది. దీంతో ఇక చేసేది లేక […]

నెల్లూరు జిల్లా: కులం పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తూ పట్టాభూమిని ఆక్రమించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నంచాడు. నెల్లూరు జిల్లా, ఇందుకూరు మండలం, ముదివర్తిపాలెంలో ఈ ఘటన కలకలం రేపింది. సునీల్ రెడ్డి అనే వ్యక్తికి సర్వే నెం. 203లో రెండున్నర ఎకరాల పొలం ఉంది. అందులో చేపల గుంటలు వేసుకుని సాగు చేస్తున్నాడు. అదే పొలం పక్కన బద్దిపూడి మొలకయ్య అనే దళిత రైతుకు ఒకటిన్నర ఎకరం పొలం ఉంది. అయితే […]

Translate

Translate »