ఇటీవల హత్యకు గురైన సుబ్బారాయుడుహత్యతో భూమా కుటుంబానికి సంబంధం ఉందన్న ఎమ్మెల్యే శిల్పా రవినోరు అదుపులో పెట్టుకోవాలన్న అఖిలప్రియకర్నూలు: కొన్ని రోజుల క్రితం కర్నూలు జిల్లా నంద్యాలలో వైసీపీ నేత సుబ్బారాయుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఉదయం పూట వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఆయనను కర్రలతో కొట్టి హత్య చేశారు. నంద్యాలలోని విజయ పాల డెయిరీ వద్ద ఈ దారుణం జరిగింది. అనంతరం ఈ హత్య […]

కాంట్రాక్టు ఉద్యోగినిపై దాడికి యత్నించిన ప్రభాకర్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు కర్నూలు: జిల్లా లోని వెలుగోడు మండలంలో ఓ దళిత మహిళపై వైసీపీ నేత ఒకరు దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. మండలంలోని రేగడ గూడూరులో కాంట్రాక్టు ఉద్యోగినిగా పని చేస్తున్న దళిత మహిళ రంగమ్మపై స్థానిక వైసీపీ నేత ప్రభాకర్ రెడ్డి దాడికి యత్నించాడు. కులం పేరుతో అసభ్యంగా దూషించాడు. ఆమెపై […]

బేతంచెర్ల: వారం రోజుల్లో జరగాల్సిన పెళ్లి రద్దు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు శానిటైజర్‌ తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలోని శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మోహిద్దీన్‌పురం గ్రామానికి చెందిన వేల్పుల ఏడుకొండలు(22) కుటుంబం కొంత కాలం క్రితం ఉపాధి నిమిత్తం బేతంచెర్లకు వచ్చి స్థిరపడ్డారు. అయ్యలచెర్వులోని పాలీస్‌ బండల ఫ్యాక్టరీలో పని చేస్తూ జీవనం సాగించేవారు. ఏడుకొండలుకు మహానంది మండలం […]

కర్నూలు: జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా పత్రికా విలేకరులపై భౌతిక దాడులకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈ సందర్భంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని జర్నలిస్టు ప్రతినిధుల బృందం జిల్లా ఎస్పీని కలిసి విలేకరులపై దాడులు చేసిన విషయం గురించి వినతి పత్రం అందజేశారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…. జర్నలిస్టుల పై భౌతిక […]

మృతి చెందిన నిండు గర్భిణి మృత దేహం ఊరిలో దహనం చేస్తే ఊరికి అరిష్టం అని మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి వదిలి వెళ్లిపోయిన గ్రామస్ఠులు కర్నూలు: జిల్లాలోని రుద్రవరం మండలం బి నాగిరెడ్డి పల్లి గ్రామంలో గర్భంతో ఉన్న లావణ్య అనే మహిళ ప్రసవం కోసం నంద్యాల ఆసుపత్రికి వెళ్ళింది. అయితే, అక్కడ ఆ మహిళ ప్రసవించకుండానే మరణించింది. దీంతో ఆ మహిళను గ్రామానికి తీసుకొచ్చారు. అయితే, గ్రామంలోని స్థానికులు […]

కర్నూలు: నంద్యాలలోని మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆగ్రో కెమికల్‌ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో శనివారం ఉదయం ప్రమాదవశాత్తూ అమ్మోనియా గ్యాస్‌ లీకైన సంఘటనలో జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, వైద్య, ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. అస్వస్థతకు గురైన వారిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి […]

కర్నూలు: పేకాటలో పట్టుబడ్డ నగదు విషయంలో తప్పుడు లెక్కలు చూపించిన ఒక సీఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేసిన సంఘటన జిల్లాలో జరిగింది. నంద్యాల పట్టణం మూడో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వారం రోజుల క్రితం పేకాట ఆడుతుండగా పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. వీరివద్ద నుంచి నగదును, సెల్‌ఫోన్లను, ప్లేకార్డులను స్వాధీనం చేసుకున్నారు. అయితే పేకాటరాయుళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు పెద్ద మొత్తంలో ఉండగా […]

కర్నూలు: జిల్లా లోని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌కు గురువారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో ఆయన హోమ్‌క్వారంటైన్‌లో ఉన్నారు. కె.నాగలాపురం దగ్గర ఉన్న విశ్వభారతి ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు ఎమ్మెల్యేను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా తెలంగాణలోనూ పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

బండిఆత్మకూరు: ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఓ యువతి బండిఆత్మకూరు బస్టాండ్‌లో మంగళవారం ఆందోళన చేపట్టింది. యువతికి ఐద్వా, సీపీఎం, డీవైఎఫ్‌ఐ తదితర ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. నంద్యాల మండలం చాపిరేవుల గ్రామానికి చెందిన యువతి.. బండిఆత్మకూరు మండలం పరమటూరు గ్రామానికి చెందిన రహిమాన్‌ బీటెక్‌ చదివే సమయంలో ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో రహిమాన్‌కు సర్వేయర్‌గా ఉద్యోగం రావడంతో పార్నపల్లె […]

Translate

Translate »