అనంతపురం: జిల్లాలో కులాలను సూచించే కాలనీల పేర్లు మార్చేయాలని కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు రూటే సపరేటు. కలెక్టర్‌గా ఆయన పంథానే వేరు. జిల్లాకు వచ్చాం.. అందరిలానే పని చేసి వెళ్లిపోదాం అని కలెక్టర్ గంధం చంద్రుడు అనుకోలేదు. మనం చేసే పనులు వచ్చే తరాలకు మార్గదర్శకంగా ఉండాలని అనుకున్నారు. అందుకే గతంలో ఎవరూ చేయని విధంగా, వినూత్నంగా, విప్లవాత్మక […]

అనంతపురం: నగరంలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఏది చేసినా అడిగేవారు లేరన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.  డ్వాక్రా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. పార్టీ పనులకు కూడా హాజరుకావాలని ఆదేశిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఇక్బాల్ అనంతపురంలో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు డ్వాక్రా మహిళలు హాజరుకావాలని హుకుం జారీ చేశారు. అయితే డ్వాక్రా మహిళలు హాజరుకాలేదు. పార్టీ కార్యక్రమాలకు తాము హాజరుకామని చెప్పారు. దీంతో వైసీపీ నేతలు […]

అనంత‌పురం/అమ‌రావ‌తి : స‌మాచార శాఖ‌లో జ‌రుగుతున్న అవినీతిపై రాష్ర్ట మాజీ యూనియ‌న్ ఉపాధ్య‌క్షుడు, జ‌ర్న‌లిస్ట్ డెవ‌ల‌ప్‌మెంట్ సోసైటీ అధ్య‌క్షుడు మ‌చ్చారామ‌లింగారెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ రోజు అనంత‌పురం రోడ్లు భ‌వ‌నాల వ‌స‌తి గృహంలో విలేక‌రుల స‌మావేశం పెట్టి మ‌రి స‌మాచార శాఖ‌పై విరుచుప‌డ్డారు. స‌మాచార శాఖ‌లో కొంత‌మంది అధికారులు ద‌ళారుల‌తో కుమ్మ‌క్కై కోట్లు దండుకుంటున్నారని ఆరోప‌ణ‌లు చేశారు. . ప్రింట్ చేయ‌ని ప‌త్రిక‌లకు అడ్వ‌ర్‌టైజ్‌మెంట్‌లు ఇస్తు లంచాలు పొందుతున్నార‌ని […]

అనంతపురం : ప్రతి నెల ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే పెన్షన్ డబ్బులను స్వాహా చేసేందుకు ప్రయత్నించిన మడకశిర మున్సిపాలిటీ లోని శివపురం వార్డు సచివాలయం వాలంటీర్ ఈరప్ప ను ఉద్యోగం నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఉదయం ప్రతి నెలా మాదిరిగానే మడకశిర మున్సిపాలిటీలోని శివపురం వార్డు సచివాలయం పరిధిలో పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేందుకు 43,500 […]

అనంతపురం: అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి ఆస్పత్రిలోని ఎఫ్‌ఏం వార్డులో ఒక్కసారి ఆక్సిజన్ లీకేజ్ మొదలైంది. దీంతో ఆస్పత్రిలోని రోగులు, సిబ్బంది బయటికి పరుగులు తీశారు. అధికారులు అప్రమత్తమవ్వడంతో ప్రమాదం తప్పింది. లీక్ నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. సమాచారం అందుకున్న ట్రైనీ కలెక్టర్ సూర్య.. అగ్నిమాపక సిబ్బందితో ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రి వద్ద పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయని.. ఎటువంటి ప్రమాదం […]

కళ్యాణదుర్గం, ఆగస్టు 23: ఆమె పుట్టుకతోనే వికలాంగురాలని అధికారులందరికీ తెలుసు. కడు పేదరికం అనుభవిస్తోందని స్టోరు డీలర్‌కూ తెలుసు. ఆమె ఏ పనిచేయలేని నిస్సహాయురాలని ఓట్లేయించుకున్న ప్రజా ప్రతినిధులకూ తెలుసు. లాక్‌డౌన్‌ కాలంలో పట్టెడన్నం దొరక ఇబ్బందులు పడుతున్న ఆమె వందశాతం నిరుపేద అని అందరికీ తెలుసు. ఆమెకు రేషన్‌ బియ్యం అందడం లేదనేది ఎవ్వరికీ తెలియని నిజం. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య నిర్వాకానికి మరుగుజ్జు మహిళ నిత్యం మనోవేదనకు గురవుతుతోంది. […]

అనంతపురం : అనంతపురం జిల్లా ట్రెజరీ కార్యాలయ ఉద్యోగి మనోజ్‌కు చెందిన ట్రంకు పెట్టెల్లో దాదాపు రూ.2.50 కోటికిపైగానే విలువైన సంపద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ వివరాలను బుధవారం అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ రామకృష్ణప్రసాద్‌ మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు… బుక్కరాయసముద్రం మండలం కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని బాలప్ప ఇంట్లో మరణాయుధాలు ఉన్నాయన్న సమాచారంతో మంగళవారం పోలీసులు సోదాలు నిర్వహించగా ఎనిమిది […]

అనంతపురం: తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌ రెడ్డిని పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌ రెడ్డి కండీషన్‌ బెయిల్‌పై గురువారం విడుదలైన విషయం తెలిసిందే. అయితే విడుదలైన 24 గంటల్లోపే వీరిద్దరినీ మళ్లీ అరెస్ట్ చేయడం గమనార్హం. జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై శుక్రవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ప్రభాకర్‌రెడ్డిపై […]

అనంతపురం: నిర్భ‌య కేసు న‌మోదైన జిల్లా వ్య‌వ‌సాయ శాఖ జాయింట్ డైరెక్ట‌ర్‌ హబీబ్‌ బాషాపై ప్ర‌భుత్వం క‌ఠిన‌ చ‌ర్య‌లు చేప‌ట్టింది. జిల్లా వ్యవసాయశాఖ జేడీ‌ పదవి నుంచి ఆయ‌న‌ను స‌స్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి మంగ‌ళ‌వారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా త‌న‌ను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ మహిళా ఉద్యోగి స‌ల్మా జేడీ హబీబ్‌పై ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై నిర్భ‌య చ‌ట్టం కింద పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. అయితే […]

Translate

Translate »