బెల్లంపల్లి : బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం న్యాయవాదులకు వెల్ఫేర్ ట్రస్టు సభ్యులు రాజ్‌కుమార్ చేతుల మీదుగా హెల్త్‌కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల ఆరోగ్యపరంగా తలెత్త సమస్యల పరిష్కారంలో హెల్త్‌కార్డులు ఉపయోగపడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంకం శికుమార్, జనరల్ సెక్రటరి చొప్పదండి శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు ఎం.శ్రీనివాస్, ఎల్.రాము, న్యాయవాదులు సతీష్, రాజేష్, అనీల్, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్
నేటి నుంచి అమల్లోకి తీసుకురానున్న పోలీసులు ఎదులాపురం, న్యూస్‌టుడే: కరోనా వ్యాప్తిని అరికట్టడానికి పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. రహదారులపై అకారణంగా తిరిగే వారిని కనిపెట్టి చర్యలు తీసుకోవటానికి పోలీసు శాఖ కొత్తగా రూపొందించిన ఆటోమెటిక్ పర్సన్ ఐడెంటిఫికేషన్ సిస్టం యాప్‌ను జిల్లాలో శనివారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. అత్యవసరమై బయటకు వచ్చినా మూడు కి.మీ. దూరం కంటే ఎక్కువ ప్రయాణం చేయొద్దని డీఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇంతకంటే […]