విశాఖ స్టీఎల్  అమ్మకం ఎందుకు పెట్టాల్సి వచ్చింది?సెయిల్ కి కేటాయించినట్లు వైజాగ్ స్టీల్ కి గనులు కేటాయించాలి!చట్ట సభల్లో నేరస్థులు ప్రజా చట్టాలు తేలేరుఎఫ్ ఆర్ టి ఐ శిక్షణా తరగతుల్లో డా. ఆలపాటికాకినాడ (వారధి ప్రతినిధి): దేశంలో పబ్లిక్ రంగ సంస్థలను విక్రయించడం ప్రజా నిర్ణయం కాదని లోటస్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆలపాటి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల అగాపే […]

కాకినాడ మున్సిపాలిటీ ఏర్పడినప్పటినుండి కొనసాగింపు!దళితులకు చైర్మన్ స్థానం లేని కాకినాడ పుర పాలక సంస్థ1866 నుండి చైర్మన్ పదవి దళితులు చేపట్టలేదంట!నిగ్గుతేల్చిన సమాచార హక్కు చట్టం(కామిరెడ్డి లలితాదేవి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్)బ్రిటిష్ పాలనా కాలంలో 1759 లోనే ఏర్పడిన కాకినాడ మున్సిపాలిటీ 1866లో అధికారికంగా మున్సిపాలిటీ గా అవతరించింది. అయితే 1907 నుండి మున్సిపాలిటీకి అధ్యక్షులు ఏర్పడ్డారు. అప్పటి నుండి ఇప్పటివరకు అనేకమంది అగ్రవర్ణాలు, బీసీలకు చెందిన వ్యక్తులు చైర్మన్ గా […]

కాకినాడ: కోవిడ్ సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్న నేపద్యంలో జిల్లాలో మాస్క్ ధారణ ప్రతి ఒక్కరూ తప్పని సరిగా పాటించాలని, మాస్క్ లేకుండా సంచరించే వారి కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి స్పష్టం చేసారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ కోర్టు హాలులో కోవిడ్-19 నివారణపై ఏర్పాటైన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా […]

పెదపూడి మండలం లోని కైకవోలు గ్రామం లోని సచివాలయం ను బుధవారం కాకినాడ ఆర్ డి ఓ ఎ.జి. చిన్ని కృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయం పరిధి లోని వాలంటీర్లతో వారి పరిధిలో ఎంతమందికి ఇండ్ల స్థలముల పట్టాలు వచ్చాయని ఒక్కొకరిని అడిగి తెలుసు కున్నారు.. తదుపరి కైకవోలు నందు గల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం ద్వారా విద్యార్థులకు పెడుతున్న భోజనమును స్వయముగా రుచి చూసి […]

మోడీపై ఒత్తిడి తీసుకురండిరాష్ట్ర మంత్రిని కోరిన సిపిఐ జిల్లా బృందం ప్రేవేటీకరణ ను అడ్డుకుందాం :మంత్రి కన్నబాబు కాకినాడ: విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో ప్రత్యక్షంగా వైసిపి భాగస్వాములు కావాలని మీరందరూ నరేంద్ర మోడీ పై ఒత్తిడి తేస్తెనే ప్రైవేటీకరణ ఆగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు రాష్ట్ర మంత్రి వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ కన్నబాబు గారిని కోరడం జరిగింది .సిపిఐ జిల్లా బృందం గురువారం ఆయన […]

భూ కబ్జాదారుల చేతుల్లో12 ఏకరాలుసర్పవరం భావనారాయణ స్వామి అన్యాక్రాంతంకాకినాడ రూరల్: సర్పవరం భావనారాయణ స్వామి గుడి సంబంధించిన వేలకోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. దీనిపై పత్రికల్లో వస్తున్న వార్తల నేపథ్యంలో శనివారం ఆలయ కమిటీ చైర్మన్ పుల్ల శేషు కుమారి మీడియా సమావేశం నిర్వహించారు. ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రామప్రజలకు.నాయకులు దన్యవాదాలు తేలిపిన కమిటీ దేశంలో ప్రాచీనమైన ఆలయాల్లో ఓకటి శ్రీ భావన్నారయణ స్వామి ఆలయమని, ఈ ఆలయానికి […]

ఉభయగోదావరి జిల్లాల అధ్యాపక, ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ రాము సూర్యారావు విజ్ఞప్తి…. కాకినాడ: శాసన మండలి లో ప్రజావాణి వినిపించడానికి సాబ్జీ షేక్ ను గెలిపించాలని ఉభయగోదావరి జిల్లాల అధ్యాపక, ఉపాధ్యాయులకు ప్రస్తుత ఎమ్మెల్సీ రాము సూర్యారావు విజ్ఞప్తి చేశారు.మార్చి 14 ను జరుగబోతున్న తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో పిడిఎఫ్ తరపున పోటీ చేస్తున్న సాబ్జీ షేక్ విజయం కోసం ప్రచారం లో భాగంగా శనివారం […]

విశాఖ ఉక్కు పరిశ్రమ కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్… మూతబడిన కాకినాడ సీ పోర్ట్, పాల్గొన్న స్కీం వర్కర్లు, దళిత సంఘాలుస్వచ్చందంగా బంద్ పాటించిన వ్యాపారవర్గాలుమూతబడిన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, బ్యాంకులుమధ్యాహ్నం వరకు ఆగిన ఆర్టీసీ కాకినాడ, మార్చి 5; విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఇచ్చిన పిలుపు రాష్ట్ర బంద్ జిల్లాలో విజయవంతమయ్యింది.కేంద్ర కార్మిక సంఘాలు, విద్యార్థి, యువజన, దళిత సంఘాలు, వామపక్ష పార్టీలు ముందుండి […]

కాకినాడ: దేశంలో 10 లక్షల లోపు జనాభా కలిగిన మున్సిపల్ కార్పొరేషన్ లకు నిర్వహించిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ లో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కు దేశవ్యాప్తంగా నాలుగవ స్థానం దక్కించుకున్న సందర్భంలో శుక్రవారం మధ్యాహ్నం దంటు కళాక్షేత్రం కాకినాడ నందు నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో బీజేపీ కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడుతూ కాకినాడ నగరం నేడు ఈ స్థానంలో నిలవడానికి కేంద్ర […]

కాకినాడ రూరల్ : ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి రూ.5లక్షలు కాజేసిన ఓ కానిస్టేబుల్ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. సర్పవరం పోలీసులకు ఈమేరకు రామచంద్రాపురం మండలం కాపవరానికి బాధితులు ఫిర్యాదు చేసారు. గతంలో ఇదే తరహాలో పలువురిని మోసగించిన కేసులలో నిందితునిగా వున్న కానిస్టేబుల్ అదే తరహాలో మోసం చేసుకుంటూ పోవడంతో పలు అను మానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని ఈవిధమైన చర్యలకు పాలోబడుతున్నాడని బాధితులు వాపోతున్నారు. […]

Translate

Translate »