అమరావతి: ఎపి లో పదో తరగతి , ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై విపక్షాల డిమాండ్ కు జగన్ సర్కార్ తలొగ్గినట్లే కనిపిస్తోంది. విద్యాశాఖ మంత్రి తాజా ప్రకటనతో పరీక్షల రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలుస్తోంది. తెలంగాణ తరహాలోనే పదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేసి.. సెకండియర్ పరీక్షను వాయిదా వేయనున్నారని సమాచారం. రెండు, మూడు రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కరోనా బారిన పడితే ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహిస్తారా? […]

మోహన్ దాస్ కరంచంద్ గాంధీకి గ్రామాలంటే అమితమైన ప్రేమ. భారతీయతకు మారు పేరు గ్రామాలే. కుల అహంకారానికి పల్లెటూర్లు పట్టుకొమ్మలు. గ్రామాలను సందర్శిస్తేనే అసలు సిసలైన, నిజమైన కుల వ్యవస్థ వికృతరూపం ప్రస్ఫుటంగా కనబడుతుంది. గ్రామంలోని భూమిపై తమకున్న గుత్తాధిపత్యాన్ని కుల వ్యవస్థ యొక్క భౌతిక ప్రాతిపదికగా డాక్టర్ అంబేడ్కర్ గుర్తించారు. గ్రామ సమాజంలో బానిసత్వం మరియు కుల ఆధారిత దోపిడీ నుండి స్వేచ్ఛతో బహుజనులు బ్రతకాలంటే భూమి కలిగి […]

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి చెలరేగిపోతోంది. రోజురోజుకు మరింతగా విజృంభిస్తూ మరణ మృదంగం మోగిస్తోంది. మంగళవారం దేశంలో రికార్డ్ స్థాయిలో 2 లక్షల 95 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలు 2 వేలు క్రాస్ అయ్యాయి. కరోనా దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి, మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా 2023 మందిని వైరస్‌ బలితీసుకుంది. […]

సాక్షి దినపత్రిక ది:14-4-2021న, ప్రచురించిన డాక్టర్ అంబేడ్కర్ క్యారీకేచర్, అవమానపరిచే విధంగా ఉంది తప్ప, గౌరవం పెంచేదిగా లేదు-ఎఐడిఅర్ఎఫ్ హోం శాఖ, కేంద్ర సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, డాక్టర్ ఉండ్రు రాజశేఖర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మరియు డాక్టర్ ప్రసాద్, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్, కోటేశ్వరరావు గారు గౌరవ పూరితమైన వ్యాసాలు ప్రముఖంగా సాక్షి పేపర్ లో రాస్తే, దానికి భిన్నంగా భారతరత్న డాక్టర్.బి.ఆర్.అంబేడ్కర్ ను అగౌరవపరిచే విధంగా […]

వైఎస్సార్. రాజకీయ శిఖరం. ఆయన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఒక సక్సెస్ ఫుల్ పొలిటికల్ ఐకాన్. వైఎస్సార్ జీవితకాలంలో అపజయం ఎదురులేని నేతగా నిలిచారు. ఆయన ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా కూడా ఏనాడూ ఓడలేదు, ఆత్మ‌విశ్వాసం అసలు వీడలేదు.ఆయనకు చాన్స్ ఇచ్చి చూస్తే ఎలా ఉంటుందో 2004,2009 ఎన్నికల్లో కాంగ్రెస్ కి రుచి చూపించారు. ఇక ఆయన కేవలం అయిదుంపావు సంవత్సరాలు మాత్రమే ఉమ్మడి ఏపీకి సీఎం గా పనిచేశారు. ఇక వైఎస్సార్ మరణించి మరింతగా జనం గుండెల్లో కొలువుండిపోయారు. ఆయన రాజకీయ వారసుడిగా జగన్ ఏపీలో అవిశ్రాంత పోరాటం […]

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకూ ఎగబాకుతున్నాయి. రాష్ట్రంలో గత 24గంటల్లో 35,922 నమూనాలు పరీక్షించగా 6,582 కేసులు బయటపడ్డాయి. 22 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,62,037కు చేరుకోగా.. మరణాల సంఖ్య 7,410కి పెరిగింది. తాజాగా 2,343 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 44,686 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 9,09,941 మంది రికవరీ అయ్యారని వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది.

చెన్నై: కరోనా వ్యాప్తి తీవ్రత దీష్ట్యా.. మహమ్మారిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంట్లో భాగంగా ప్రతి ఆదివారం పూర్తి లాక్‌డౌన్‌తో పాటు మిగతారోజుల్లో రాత్రి 10 నుంచి ఉదయం 4వరకు కర్ఫ్యూ విధించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

అంబేద్కర్ విగ్రహం ధ్వసం చేసిన కేసులో 5 గురిని అరెస్ట్ చేసిన కోటనందూరు పోలీసులు కోటనందూరు: గత నాలుగు రోజుల క్రితం కోటనందూరు మండలం పాత కొట్టాం గ్రామంలో గల 3 రోడ్డుల జంక్షన్ వద్ద గల ఆంబేద్కర్ విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని దుండగులు పగులగొట్టిన సంఘటనలో తూర్పు గోదావరి జిల్లా ఎస్పి నయీం అస్మి సత్వర ఆదేశాల మేరకు పెద్దాపురం డిఎస్పి ఆరిటాకుల శ్రీనివాసరావు పర్యవేక్షణ లో […]

కాకినాడ: జిల్లా స్థాయిలో కొవిడ్ సేవలను పర్యవేక్షణ నిమిత్తం కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన కొవిడ్ కంట్రోల్ రూమ్ ను శనివారం ఉదయం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి సందర్శించారు. ఈ సందర్భంగా జేసి కీర్తి చేకూరి కంట్రోల్ రూమ్ లో ఉన్న హోం క్వారంటైన్, హోంఐసోలేషన్, ఆరోగ్యశ్రీ, సీసీటీవీ ద్వారా కొవిడ్ ఆసుపత్రుల పర్యవేక్షణ, కొవిడ్ టీకా,108,104, ఇతర విభాగాలకు […]

అమరావతి: మాజీ మంత్రి దేవినేని ఉమకు మరోసారి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గొల్లపూడిలోని ఉమ నివాసానికి రెండోసారి నోటీసులు అంటించారు. ఈనెల 19న కర్నూలు సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. 15న దేవినేనికి మొదటి నోటీసు ఇచ్చారు. అప్పుడు దేవినేని ఉమ.. తనకు 10 రోజులు సమయం కోరారు. సీఎం జగన్‌ మాటలను వక్రీకరించారన్న న్యాయవాది ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు […]

Translate

Translate »