సీబీఐ వాళ్లు వస్తున్నారట… హైదరాబాదులో కొవిడ్ బెడ్లు రెడీ చేసుకో సాయిరెడ్డీ!: అయ్యన్న

  • ట్విట్టర్ లో అయ్యన్న విసుర్లు
  • ఏ2 దొంగ రెడ్డీ అంటూ వ్యాఖ్యలు

విశాఖపట్నం: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మరోసారి ధ్వజమెత్తారు. “ఏ2 దొంగ రెడ్డీ… బాబాయ్ గొడ్డలితో గుండెపై పొడుచుకున్నాడా? లేక మీరే గొడ్డలి వేటు వేశారా? ఓ చెల్లి తెలంగాణ రోడ్లపైనా, మరో చెల్లి ఢిల్లీలో అన్న కాదు అరాచకుడని నినదిస్తూ భయపెడుతున్నారా?” అంటూ ప్రశ్నించారు. “పంచాయతీలు, మున్సిపాలిటీలు గెలిచాం అంటూ కాలర్ ఎగరేస్తున్న ఏ1 వలలు, బారికేడ్లు, 1000 మంది పోలీసుల కాపలాలో వ్యాక్సిన్ వేయించుకున్నాడంటేనే జనాన్ని చూసి ఎలా వణుకుతున్నాడో అర్థమవుతోంది” అని ఎద్దేవా చేశారు. “సీబీఐ వాళ్లు వస్తున్నారట… హైదరాబాదులో కొవిడ్ బెడ్లు రెడీ చేసుకో సాయిరెడ్డీ!” అంటూ చివర్లో చురకేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఎన్నికల వేళ చంద్రబాబుకు భారీ షాక్.. వైసీపీలోకి టీడీపీ నేత..?

Wed Apr 7 , 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష టీడీపీ అయోమయంలో పడిపోయింది. ఇక ఆ తర్వాత సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ కూడా టీడీపీకి మరింత సమస్యగా తీసుకొచ్చాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా దూసుకుపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలోనే టీడీపీ పార్టీకి చెందిన నేతలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధమయ్యారు. అయితే ఎలక్షన్లో గెలవగానే ఇక పదవికి రాజీనామా చేస్తే తప్ప ఇతర పార్టీలో చేరడానికి వీలు లేదు అంటూ […]

Translate

Translate »