లాభాలొచ్చినా తెగనమ్ముతారా?

గ్రేటర్‌ విశాఖ : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ అంటే యంత్రాలు కాదు… కార్మికుల గుండె చప్పుడు… విశాఖ భవిష్యత్‌… తెలుగు ప్రజల ఆత్మగౌరవం… అలాంటి స్టీల్‌ప్లాంట్‌ను 100 శాతం అమ్మేయాలన్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యమిస్తున్న కార్మిక వర్గం.., ఉత్పత్తిని పెంచడంలోనూ అదే సంకల్పాన్ని ప్రదర్శిస్తోంది. నష్టాలవల్లే ప్రైవేటీకరణ చేస్తున్నామని బిజెపి ప్రభుత్వం చేస్తోన్న ప్రచారం అబద్ధమని కంపెనీ వార్షిక నివేదిక తేలతెల్లం చేస్తోంది. ఆర్‌ఐఎన్‌ఎల్‌ (విశాఖ స్టీల్‌ప్లాంట్‌) సిఎమ్‌డి పికె.రథ్‌ గురువారం కంపెనీ వార్షిక నివేదికను విడుదల చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.18 వేల కోట్ల టర్నోవర్‌ నమోదు చేసిందని, 13 శాతం వృద్ధిని సాధించిందని, గత నాలుగు నెలల్లో సుమారు రూ.740 కోట్ల నికర లాభాలను ఆర్జించిందని ఆ నివేదికలో తెలిపారు. కార్మిక నాయకులు ముందు నుంచి చెబుతున్నట్లుగా లాభల్లోనే ప్రయాణం చేస్తుందన్న విషయం ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లాభాలు వచ్చినా స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం తెగనమ్ముతుందా? అంటూ విశాఖ ప్రజానీకం, కార్మిక వర్గం ప్రశ్నిస్తోంది. 20 ఏళ్లలో కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు సరికదా, సొంతకాళ్లపై ఎదిగిన విశాఖ ఉక్కును కార్పొరేట్‌లకు కట్ట బెట్టాలని మోడీ ప్రభుత్వం నిర్ణయం చేసింది. దీంతో ఏపీపైనా, విశాఖ పారిశ్రామిక ప్రగతిపైనా బీజేపీ కుట్రలు తేటతెల్లమైనాయంటూ మేధావులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
49 రోజులుగా స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు పోరాడుతూనే స్టీల్‌ ఉత్పత్తి లోనూ భాగం పంచుకుంటూ అభివృద్ధిని సాధించి చూపారు. మార్చి నెలలో రూ.3267కోట్లు స్టీల్‌ అమ్మకాలు చేసి, రూ.300 కోట్లు లాభాలు చూపించడం అరుదైన రికార్డ్‌. పైగా 3 బ్లాస్ట్‌ ఫర్నేస్‌లకుగాను, ఒకదాని పైనే పనిచేస్తూ ఈ ప్రగతిని సాధించారు. బీజేపీ పాలకులకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలి. లేదంటే ఏపీ బీజేపీ, విశాఖ బీజేపీ నేతలైన అది కలిగించక పోతే విశాఖ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నది ప్రజల నుంచి వినిపిస్తున్న మాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా

Fri Apr 2 , 2021
పరిషత్ ఎన్నికలు బహిష్కరించాలని టీడీపీ నిర్ణయంపై నిరసన గళం జగ్గంపేట: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించడంపై ఆ పార్టీ నేత జ్యోతుల నెహ్రూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన టీడీపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పరిషత్ ఎన్నికలను బాయ్ కాట్ చేయాలన్న పార్టీ నిర్ణయం తనను నిరాశకు గురిచేసిందని జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. అందుకే పార్టీ రాష్ట్ర […]

Translate

Translate »