అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష టీడీపీ అయోమయంలో పడిపోయింది. ఇక ఆ తర్వాత సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ కూడా టీడీపీకి మరింత సమస్యగా తీసుకొచ్చాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా దూసుకుపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలోనే టీడీపీ పార్టీకి చెందిన నేతలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధమయ్యారు. అయితే ఎలక్షన్లో గెలవగానే ఇక పదవికి రాజీనామా చేస్తే తప్ప ఇతర పార్టీలో చేరడానికి వీలు లేదు అంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎంతో మంది వైసీపీలోకి రాకుండా ఆగిపోయారు.
చంద్రబాబుకు మాత్రం దూరంగా ఉంటూ మరోవైపు వైసీపీ కి మద్దతు పలుకుతూ ఇక అసెంబ్లీలో కూడా వైసిపికి మద్దతుగానే మాట్లాడుతూ వస్తున్నారు ఎంతో మంది కీలక టీడీపీ నేతలు. అంతే కాదు ఎంతో మంది మాజీ ఎమ్మెల్యేలు టీడీపీ కీలక నేతలు సైతం అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి క్రమక్రమంగా చేరుతుండటంతో చంద్రబాబుకు షాక్ లు తగులుతు ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇటీవలే మరోసారి చంద్రబాబు కు ఊహించని షాక్ తగిలింది. గుంటూరు జిల్లా బాపట్ల మాజీ ఎమ్మెల్యే మంతెన అనంతవర్మ ఇటీవలే టిడిపి పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
టిడిపి పార్టీకి గుడ్ బై చెప్పిన మంతెన అనంతవర్మ ఇటీవలే తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరినట్లు తెలుస్తుంది. అనంత వర్మ కు వైసీపీ కండువా కప్పి సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంత వర్మ తో పాటు మరికొంతమందికి స్థానిక టిడిపి నేతలు కూడా జగన్ సమక్షంలో టీడీపీలో చేరినట్లు తెలుస్తుంది. అయితే ఇలా టిడిపి నుంచి వరుసగా కీలక నేతలు పార్టీని వదిలి వైసీపీ పార్టీలో చేరుతుండడంతో.. చంద్రబాబుకు ఊహించని షాక్ తగులుతునే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఎన్నికల వేడి కొనసాగుతున్న సమయంలో ఇలాంటి చేరికలు మాత్రం టిడిపిని ఎంతగానో దెబ్బతీసే అవకాశం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు ఏం జరుగుతుందో చూడాలి మరీ.