ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా

  • పరిషత్ ఎన్నికలు బహిష్కరించాలని టీడీపీ నిర్ణయంపై నిరసన గళం

జగ్గంపేట: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించడంపై ఆ పార్టీ నేత జ్యోతుల నెహ్రూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన టీడీపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పరిషత్ ఎన్నికలను బాయ్ కాట్ చేయాలన్న పార్టీ నిర్ణయం తనను నిరాశకు గురిచేసిందని జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. అందుకే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నానని వివరించారు. అయితే, తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట టీడీపీ ఇన్చార్జిగా కొనసాగుతానని స్పష్టం చేశారు.

జ్యోతుల నెహ్రూ గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. అంతకుముందు 2014లో వైసీపీ తరఫున పోటీచేసి  విజయం సాధించారు. 1994, 1999లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

సీబీఐ వాళ్లు వస్తున్నారట... హైదరాబాదులో కొవిడ్ బెడ్లు రెడీ చేసుకో సాయిరెడ్డీ!: అయ్యన్న

Sat Apr 3 , 2021
ట్విట్టర్ లో అయ్యన్న విసుర్లు ఏ2 దొంగ రెడ్డీ అంటూ వ్యాఖ్యలు విశాఖపట్నం: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మరోసారి ధ్వజమెత్తారు. “ఏ2 దొంగ రెడ్డీ… బాబాయ్ గొడ్డలితో గుండెపై పొడుచుకున్నాడా? లేక మీరే గొడ్డలి వేటు వేశారా? ఓ చెల్లి తెలంగాణ రోడ్లపైనా, మరో చెల్లి ఢిల్లీలో అన్న కాదు అరాచకుడని నినదిస్తూ భయపెడుతున్నారా?” అంటూ ప్రశ్నించారు. “పంచాయతీలు, మున్సిపాలిటీలు […]

Translate

Translate »