సామర్లకోట మున్సిపాల్టీలో సామాజిక మార్పు

బి బి  ఆర్ కె రావు,సామర్లకోట అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం, ఇటీవల జరిగిన  సామర్లకోట మున్సిపల్ ఎన్నికలలో   కొంత వరకు  సామాజిక మార్పు వచ్చిందని చెప్పవచ్చు.  రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సామర్లకోట పంచాయితీ ఏర్పడిన నుండి అగ్రకుల  సూద్రులైన కమ్మ సామాజిక వర్గం వారే నాయకత్వం వహించేవారు. మరో అగ్రకుల (మధ్య)  సూద్రులైన  కాపు సామాజిక వర్గం వారు సామర్లకోటలో మిగిలిన అన్ని కులాలు కన్నా ఎక్కువ ఉన్నా ఇంతవరకూ   పంచాయతీ ప్రెసిడెంట్ గా కానీ, మున్సిపల్ చైర్మన్ గా కానీ ఎన్నిక కాలేదు.  వీరిలో 90శాతం పైగా సామాన్యులుగా ఉన్నారు.  రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా  వెనుకబడి ఉన్నారు. అందువల్లనే కాపులను  బీసీలుగా గుర్తించాలని పోరాడుతున్నారు.  అయితే ఈసారి 31 వార్డులకు 29 వార్డ్లు
  వైయస్సార్సీపి గెలవడంతో కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ గంగిరెడ్డి అరుణ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయింది.  తెలుగుదేశం గెలిచినా కాపు  మహిళ చైర్ పర్సన్ అయ్యుండేది.  ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలలో మూడు పార్టీలకు కాపులే నాయకత్వం  వహించారు.  వైయస్సార్ సిపి తరపున నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు తండ్రి సుబ్బారావు నాయకత్వం వహించారు.  తెలుగుదేశం పార్టీ తరఫున ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వచ్ఛంద సేవకుడు  గొరక పూడి చిన్నయ్య దొర, జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన తుమ్మల బాబు నాయకత్వం వహించారు.   సామర్లకోటలో మొత్తం 41,198  ఓట్లు ఉండగా ఎస్టీలు 411,  ఎస్సీలు 7613, బీసీలు 13,900  ఓసీలు 19,274  ఓట్లు ఉన్నాయి.   ఎస్సీ, బీసీ ఓట్ల కన్నా కాపులు ఓట్లే అధికమని చెప్పవచ్చు. వీరు ఎస్ సి లు అధికంగా ఉన్నా తప్పా  అన్ని వార్డుల్లో విస్తరించి ఉన్నారు కాపుల కన్నా కమ్మ వారి వోట్లు తక్కువగా ఉన్నాయి.   మొత్తం 31  వార్డు లోనూ నాలుగు వార్డుల్లో మాత్రమే కమ్మ వారు ఎక్కువగా ఉన్నారు ఈ వార్డుల్లో బీసీలు కొంతవరకూ ఇతర ఓసీలు కూడా ఉన్నారు ఇకఅమ్మవారు కేంద్రీకృతమైన నాలుగో వార్డు లోనూ రెండు వార్డుల్లో టిడిపి రెండు వార్డుల్లో వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు గెలిచారు నలుగురు కమ్మవారి గెలిచారు 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ముక్కోణపు పోటీ జరగగా ఎమ్మెల్యేగా గెలిచిన నిమ్మకాయల చినరాజప్ప కు సామర్లకోటలో స్వల్పంగా మెజార్టీ వచ్చింది అయితే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో టిడిపికి రెండు వార్తలు మాత్రమే దక్కినవి టిడిపి జనసేన సర్దుబాటు చేసుకున్నా వారి వ్యూహం ఫలించలేదు మొత్తం 31 వ వార్డు లోనూ వైఎస్సార్సీపి  రెండు వార్డుల్లో ఏకగ్రీవంగా ఎన్నికైంది దీంతో వైయస్సార్ సిపి 29 వార్డుల  లోనూ టిడిపి 20 వార్డుల  లోనూ జనసేన 12 వార్డుల  లోనూ బీజేపీ 3 వార్డుల  లోనూ సిపిఐ సిపిఎం ఒక్కొక్క వార్డుల లోను పోటీ చేశాయి.  టిడిపి జనసేన పార్టీలు సర్దుబాటు చేసుకున్నా వైఎస్ఆర్సిపి కి వచ్చిన ఓట్లలో సగం వచ్చాయి ఎక్కువగా ముఖాముఖి పోటీ జరిగింది అయినా వైయస్ఆర్సిపికి 18043,  టీడీపీకి 5675,  జనసేన కి 3512 ఓట్లు వచ్చాయి.   టిడిపికి ఎప్పుడూ ఇంత తక్కువ ఓట్లు రాలేదు. టిడిపికి జనసేనకు కలిపి 9187 ఓట్లు వచ్చాయి.   దీంతో వైఎస్సార్ సీపీకి 9216 ఓట్లు అధికంగా వచ్చాయి.  ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి కన్నా వైఎస్సార్సీపీకి 12728  ఓట్లు వచ్చాయి వైయస్సార్సీపి కమ్మ వారి వోట్లు తప్పా అన్ని సామాజిక వర్గాలు ఓట్లు పడినట్లు అర్థమవుతోంది వైయస్సార్ సిపి కి ఈ విధంగా ఓట్లు రావడానికి సంక్షేమ పథకాలు వాలంటీర్ వ్యవస్థ ఇళ్లస్థలాలు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు అంతేగాక టీడీపీకి పట్టణంలో సరైన నాయకత్వం లేకపోవడం కూడా ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు సామర్లకోట గ్రామ పంచాయతీగా ఏర్పడినప్పటి నుండి ప్రెసిడెంట్గా కమ్మవారి ఉన్నారు కమ్మ వర్గానికి చెందిన పట్టణంలో పెద్ద అయినా చంద్ర పద్మరాజు ఎక్కువ కాలం ప్రెసిడెంట్ గా చేశారని పెద్దలు చెబుతున్నారు తర్వాత కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావంతో కమ్మ వర్గానికి చెందిన ఉండవల్లి నారాయణ మూర్తి 1953లో గ్రామ   ప్రెసిడెంట్ చేశారు ఉండవల్లి కమ్మ వర్గానికి చెందిన సామాన్య కుటుంబం నుండి వచ్చి ప్రెసిడెంట్ అయ్యారు సామర్లకోట లో ఉన్న ధనవంతులు ఆధిపత్యాన్ని ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు గా కార్మిక నాయకుడిగా ఎదిగారు ఆయన నివాసం ఉన్న వీధిని ఇప్పటికి కూడా ప్రెసిడెంట్ గారి వీధి అంటారు 1956లో సామర్లకోట గ్రామపంచాయతీ కాస్త మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ తరపున  ఉండవల్లి రెండుసార్లు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు ఒకసారి కాపు వర్గానికి చెందిన దూల వీర్రాజు రెండోసారి ఎస్సీ వర్గానికి చెందిన తర్లంపూడి సత్తిరాజు వైస్ చైర్మన్ అయ్యారు.  పెద్దాపురం నియోజక వర్గానికి 1967లో సిపిఐ తరఫున పోటీ చేసి  ఉండవల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  దీంతో బలమైన నాయకుడిగా ఉండవల్లి ఎదిగారు.  తర్వాత కమ్యూనిస్టు పార్టీ బలహీనపడటంతో పార్టీ మారి ఇందిరా కాంగ్రెస్ తరపున 1978లో పోటీ చేసి  మరలా ఎమ్మెల్యే అయ్యారు.  వందల 81 లో పార్టీ రహితంగా మున్సిపల్ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలను నిమిత్తం ప్రముఖ వైద్యులు డాక్టర్ చందన అనంతపద్మనభం డాక్టర్ నాయకత్వంలో పట్టణ అభివృద్ధి కమిటీగా ఏర్పడి పోటీచేశాయి.  ఈ కమిటీ ఆధ్వర్యంలో పోటీ చేసిన అభ్యర్థి గెలిచారు వీరిద్దరూ కూడా తమ వర్గానికి చెందిన వారే ఈ ఎన్నికల్లో చైర్మన్ పదవి ఎస్సీ కేటాయించారు దీంతో సామర్లకోట పంచదార ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నా వెంకట్రాజు చైర్మన్ గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా డాక్టర్ చంద్ర అనంత పద్మనాభం ఎన్నికయ్యారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1987లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో  చైర్మన్ గా డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం (కమ్మ) వైస్ చైర్మన్ గా బొనాసు వెంకటేశ్వరరావు (కాపు) ఎన్నికయ్యారు.  తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు చైర్మన్ గా కాని వైస్  ఛైర్మన్ గా కాని ఎన్నిక కాలేదు. 1995లో   మున్సిపల్ చైర్మన్ గా బండి సత్యనారాయణమ్మ( ఎస్సి),   వైస్ చైర్మన్ గా గోల్డ్ దొరబాబు (కమ్మ), 2000లో   చైర్మన్గా అలమండ  చిన్న అప్పారావు( బిసి),  వైస్ చైర్మన్ గా గుణం రాజ్ అబ్బాయి (కమ్మ)  ఎన్నికయ్యారు.  2005లో  చైర్మన్గా గోలి వెంకటలక్ష్మి (కమ్మ),  వైస్ చైర్మన్గా  గోలి దొరబాబు(కమ్మ) ఎన్నికయ్యారు. వీరిద్దరూ భార్యాభర్తలు కావడం విశేషం. 2013లో  చైర్మన్గా మన్యం పద్మావతి (కమ్మ),  వైస్ చైర్మన్ గా కరికం గోపాలం (ఎస్టి),  తర్వాత కొంతకాలానికి యార్లగడ్డ చిన్ని (కమ్మ) ఎన్నికయ్యారు.  మారిన భౌతిక పరిస్థితుల్లో కాపు వర్గానికి చెందిన దవులూరి దొరబాబు,  దవులూరి సుబ్బారావు  వైసీపీ తరఫున గొరక పూడి చెన్నయ్య దొర  టిడిపి తరఫున నాయకత్వం వహించారు.  దవులూరి సుబ్బారావు స్థానిక పంచదార ఫ్యాక్టరీ లో ఉద్యోగిగా పనిచేస్తూ ఉండవల్లి నారాయణమూర్తికి ముఖ్య అనుచరుడిగా ఉండేవారు.  దీనితో ప్రముఖ రాజకీయ నాయకుడిగా, కార్మిక నాయకుడిగా ఎదిగారు.  అతని కుమారుడు దొరబాబు మెకానికల్ ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ రంగంలో రాణించి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు.  తర్వాత దొరబాబు రాజకీయాలలోకి కూడా వచ్చారు.  ఆయన తండ్రి సహకారంతో  వైయస్సార్ సిపి తరపున స్థానికంగాను,  పెద్దాపురం నియోజక వర్గానికి కోఆర్డినేటర్ గాను  నాయకత్వం వహిస్తున్నారు. 2014  ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు వైయస్సార్సీపి కి వెళ్లారు.  దీంతో కాపు వర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్ప  పెద్దాపురం నియోజకవర్గం నుండి తెలుగుదేశం తరఫున పోటీ చేశారు.  స్థానికంగా ప్రస్తుతం తన వర్గానికి చెందిన బలమైన నాయకత్వం లేదు.  ఈ పరిస్థితుల్లో వైయస్సార్సీపి రూపంలో కాపు వర్గం వారు స్వాతంత్రం వచ్చిన 73 సంవత్సరాల తర్వాత మునిసిపాలిటీ లో అడుగు పెట్టడం జరిగింది.  అంతేగాక కాపులు అధికారంలోకి రావాలంటే అంబేద్కర్ ఆలోచన ప్రకారం బిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొవలని సామర్లకోట మున్సిపల్ ఎన్నికలు రుజువు చేశాయి.  ఏమైనా సామర్లకోట రాజకీయాల్లో కొంత సామాజిక మార్పు వచ్చిందని చెప్పవచ్చు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

పబ్లిక్ రంగ సంస్థల విక్రయం ప్రజా నిర్ణయం కాదు

Tue Mar 30 , 2021
విశాఖ స్టీఎల్  అమ్మకం ఎందుకు పెట్టాల్సి వచ్చింది?సెయిల్ కి కేటాయించినట్లు వైజాగ్ స్టీల్ కి గనులు కేటాయించాలి!చట్ట సభల్లో నేరస్థులు ప్రజా చట్టాలు తేలేరుఎఫ్ ఆర్ టి ఐ శిక్షణా తరగతుల్లో డా. ఆలపాటికాకినాడ (వారధి ప్రతినిధి): దేశంలో పబ్లిక్ రంగ సంస్థలను విక్రయించడం ప్రజా నిర్ణయం కాదని లోటస్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆలపాటి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల అగాపే […]

Translate

Translate »