మున్సిపల్ పన్ను విధింపుపై భక్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోండి!

👉 మస్జిద్ ఏ బిలాల్ మనోభావాలకు సంబంధించినది
👉 కమిషనర్ తో ఫోన్లో మాట్లాడిన మంత్రి కొడాలి నాని

గుడివాడ : మున్సిపల్ పన్ను విధింపుపై భక్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) అన్నారు . శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని బంటుమిల్లి రోడ్డులోని మస్జిద్ ఏ బిలాల్ అధ్యక్షుడు అబ్దుల్ హక్ , కార్యదర్శి అబ్దుల్ రహీం , అబ్దుల్ హల్లమ్ , బాబు , రహ్మతుల్లా షరీఫ్ , ఎస్ కే బాజీ , అలీబేగ్ , ఉమర్ బేగ్ , షఫీవుల్లా తదితరులు కలిశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 40 ఏళ్ళ కిందట అబ్దుల్ సత్తార్ తనకున్న 220 చదరపు గజాల్లోని కొంత స్థలాన్ని ముస్లింల కోరిక మేరకు మసీదు నిర్మాణానికి దానంగా ఇచ్చారని చెప్పారు . ఆ తర్వాత 1995 లో కొంత స్థలాన్ని మసీదు విస్తరణ నిమిత్తం విక్రయించారని తెలిపారు . ఇంకా మిగిలిన స్థలాన్ని ఇతరులకు విక్రయించారన్నారు . 2012 అక్టోబర్ 16 వ తేదీ వరకు మసీదు నిర్వహణ వ్యవహారాలను సత్తార్ చూశారన్నారు . ప్రస్తుతం మసీదు నిర్వహణ బాధ్యతలను నమాజ్ కు వచ్చే భక్తులు చూస్తున్నారన్నారు . గతంలో మసీదును నిర్వహించిన అబ్దుల్ సత్తార్ మున్సిపల్ పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారన్నారు . నమాజ్ కు వచ్చే భక్తులంతా ప్రార్ధనా స్థలాలకు మున్సిపల్ పన్ను లేదనే భావనలో ఉ న్నారన్నారు . గత జనవరి 28 వ తేదీన మున్సిపల్ సిబ్బంది రూ .2.12 లక్షల డిమాండ్ నోటీసును ఇచ్చారన్నారు . రూ .1.04 లక్షల పన్నుకు రూ .1.08 లక్షల అపరాధ రుసుం , వడ్డీని కలిపి చెల్లించాలని చెప్పారన్నారు . ఈ పన్నులను చెల్లించే ( మత మసీదుకు వచ్చే భక్తులకు లేదన్నారు . మసీదు విషయం ముస్లింల మనోభావాలు , మసీదు భక్తులకు సంబంధించిందని చెప్పారు . మున్సిపల్ అధికారులు చెల్లించాలని చెబుతున్న పన్నులను మాఫీ చేయించాలని కోరారు . మున్సిపల్ పన్నులను ఏకమొత్తంలో పరిష్కరించుకునేందుకు వన్ టైం సెటిల్ మెంట్ కింద కొంత మొత్తాన్ని చెల్లించేందుకు అవకాశం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు . ఇకపై మసీదు స్థలానికి మాత్రమే మున్సిపల్ పన్నులు చెల్లించాల్సి వస్తే మస్జిద్ బిలాల్ పేరున డిమాండ్ నోటీసును ఇప్పించేలా చూడాలని వారు కోరారు . అనంతరం మంత్రి కొడాలి నాని మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్ తో ఫోన్లో మాట్లాడారు . ముస్లింల మనోభావాలకు మస్జిద్ ఏ బిలాల్ అని , దీనికి పన్ను విధించే విషయంలో ముస్లిం మత పెద్దలు , భక్తుల అభిప్రాయాలను కూడా గౌరవించాల్సి ఉందన్నారు . అందరితో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకోవాలని మంత్రి కొడాలి నాని కమిషనర్ సంపత్ కుమార్‌ను ఆదేశించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

గిరిజన మహిళ మరణానికి కారణమైన గ్రానైట్ లారీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి!

Fri Mar 26 , 2021
గిరిజన మహిళ కుటుంబానికి గ్రానైట్ యాజమాన్యం 10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి రావికమతం: మండలం లోని ఎర్ర బంద సమీపంలో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కొట్నబిలి నుండి చిన్న పాసి ల్లీ గ్రామం నుండి వస్తున్న గ్రానైట్ లారీ కొట్నబిల్లి గ్రామం నుండి వస్తున్నబైక్ మీద వస్తూ ఎర్ర బండ గ్రామం సమీపంలో బైక్ మీద వస్తున్న రాజేశ్వరి గ్రానైట్ లారీ బైక్ను ఢీకొనడంత చక్రం కిందపడిపోయింది అక్కడికక్కడే […]

Translate

Translate »