కోవిడ్ సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్న నేపద్యంలో మాస్క్ ధారణ ప్రతి ఒక్కరూ తప్పని సరి: కలెక్టర్

కాకినాడ: కోవిడ్ సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్న నేపద్యంలో జిల్లాలో మాస్క్ ధారణ ప్రతి ఒక్కరూ తప్పని సరిగా పాటించాలని, మాస్క్ లేకుండా సంచరించే వారి కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి స్పష్టం చేసారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ కోర్టు హాలులో కోవిడ్-19 నివారణపై ఏర్పాటైన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ పాజిటీవ్ కేసుల నమోదు మరల పెరుగుతున్న దృష్ట్యా టెస్టింగ్, కాంటాక్ట్ ట్రాకింగ్, ఐసోలేషన్ చర్యలతో పాటు ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో హెల్త్ కేర్ వర్కర్లు 6,349 మంది తొలి డోసు, 7994 మంది రెండవ డోస్ వేయించుకోవలసి ఉందన్నారు. అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్లు 23948 మంది తొలి డోసు, 22,377 మంది రెండవ డోస్ వేయించుకోవాల్సి ఉందన్నారు. కోవిడ్ నియంత్రణలో కీలకమైన వీరందరూ వ్యాక్సిన్ తప్పని సరిగా పొందేట్లు చూడాలని ఆధికారులను కోరారు. మూడవ దశ వాక్సినేషన్ క్రింద ప్రస్తుతం నిర్వహిస్తున్న 236 వ్యాక్సినేషన్ సెంటర్లతో పాటు ప్రతి పి హెచ్ సి పరిధిలో నాలుగు గ్రామ సచివాలయాలలో సోమ, బుధ, గురు, శని వారాలలో మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ పంపిణీ నిర్వహించాలని మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఆదేశించారు. ఇందులో భాగంగా 25వ తేదీ గురువారం కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్ పరిధిలో ట్రయల్ విధానంలో సచివాలయల్లో వాక్సినేషన్ ప్రారంభించాలని సూచించారు. 4,48,648 మంది 60 ఏళ్లు పైబడిన వారికి, కో మార్బిడ్ వ్యాధులు కలిగిన 45 నుండి 60 ఏళ్ల వ్యక్తులకు వెరసి 6,54,126 లక్ష్యంగా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను నిర్వహించాలన్నారు. ముఖ్యంగా హాట్ స్పాట్ లుగా కేసులు నమోదౌతున్న గ్రామాల్లో ముందుగా ఈ డ్రైవ్ చేపట్టాలన్నారు. కోవిడ్ నివారణ పై అవగాహన, ఆచరణ ప్రజల్లో పెంపొందించేందుకు ఈ నెల 24 నుండి ఏప్రియల్ 7వ తేదీ వరకూ 15 రోజుల పాటు జిల్లా అంతటా ప్రత్యేక అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మాస్క ధారణ, 6 అడుగుల దూరం పాటింపు, చేతుల పరిశుబ్రత అంశాలతో పాటు సురక్షితమైన వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రజలను ఈ కార్యక్రమాల ద్వారా మోటివేట్ చేయాలని కోరారు.
మాస్క ధరించకుంటే కేసు, జరిమానాః జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 489 యాక్టీవ్ కేసులు ఉన్నాయని, వీటిలో 33 మందికి మాత్రమే ఆసుపత్రిలో వైద్యం అవసరం కాగా, మిగిలిన వారందరినీ హోమ్ ఐసోలేషన్లో ఉంచడం జరిగిందన్నారు. పెరుగుతున్న కోవిడ్ పాజిటీవ్ కేసులను నియంత్రించేందుకు పాజిటీవ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో 50 మీటర్ల కంటైన్మెంట్ జోన్ అమలు చేస్తున్నామని, జిల్లాలో ప్రస్తుతం 117 చోట్ల ఈ జోన్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని 42 మండలాల్లో పాజిటీవ్ కేసులు నమోదు కాగా, కాకినాడ అర్బన్, రూరల్, రాజమండ్రి, అర్బన్, రూరల్ మండలాల్లో ఎక్కువ కేసులు నమోదైయ్యాయన్నారు. ఎక్కవ కేసుల్లో బయటి ప్రాంతాల నుండి వచ్చిన వారే ఉన్నారని, అందువల్ల గ్రామాలకు ఇతర ప్రాంతాల నుండి క్రొత్తగా వచ్చిన వ్యక్తులెవరి నైనా గుర్తిస్తే వారికి కోవిడ్ పరీక్షలు విధిగా నిర్వహించి, అవసరమైతే కోరంటైన్ లో ఉంచాలని సూచించారు. అలాగే అటువంటి వ్యక్తుల ప్రైమరీ, సెంకడరీ కాంటాక్ట్ లను కూడా పరిక్షించాలని ఆదేశించారు. జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని, మాస్క్ లేకుండా బయట సంచరించే వారిపై కేసులు నమోదు చేసి, జరిమానా విధించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. కోవిడ్ కేసుల కొరకు ప్రతి డివిజన్లో ఒక ప్రత్యేక ఆంబులెన్స్ కొనసాగిస్తూన్నామని, కాకినాడ జిజిహెచ్, రాజమండ్రి జిల్లా అసుపత్రి, అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలలో కోవిడ్ ప్రత్యేక విభాగాలను తిరిగి ప్రారంభించనున్నామని తెలిపారు. కోవిడ్ రోగుల చికిత్స కొరకు జిల్లాలో 738 బెడ్లు, 156 ఐసియు బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కాతేరు లోని కళాశాలలో కోవిడ్ పాజిటీవ్ గా నమోదైన విద్యార్థులకు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచామని, వైరస్ వ్యాప్తి నిరోధానికి అన్ని చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ సంఘటన నేపద్యంలో విద్యార్థులను ఇంటినుండే పంపాలని తల్లిదండ్రులను ఆయన కోరారు.
ఈ కార్యక్రమాల్లో జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి, అడిషనల్ ఎస్పిలు కరణం కుమార్, సిహెచ్.పాపారావు, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, డిఎంహచ్ఓ కెవిఎస్ గౌరీశ్వరరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అంబేడ్కర్ స్టడీ సర్కిల్ సిబ్బందిని తొలగించడం అన్యాయం

Wed Mar 24 , 2021
మంత్రి విశ్వరూప్ కి కెవిపి ఎస్ వినతి పత్రం అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ సెంటర్ లో 16 సంవత్సరాలు నుంచి పని చేస్తున్న సిబ్బందిని అక్రమంగా తొలగించడం అన్యాయమని వారిని కొనసాగించాలని కెవీపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి విజ్ఞప్తి చేసారు. వారికి వెంటనే జీతాలు ఇవ్వాలని, ఎస్సీ కమీషన్ చైర్మన్, సభ్యులను నియమించాలని, జుడిషియల్ పవర్స్ ఇవ్వాలని బుధవారం సచివాలయంలో సాంఘిక సంక్షేమ […]

Translate

Translate »