ఏసీబీ వలలో చిక్కిన ఎంపీడీవో ఎన్.ఆర్.ఈజీ.ఎస్ సిబ్బంది

ఎసిబికి పట్టిచ్చిన ఫోరమ్ ఫర్ ఆర్ టి ఐ జిల్లా అధ్యక్షుడు

వికారాబాద్: జిల్లా లోని పరిగి మండలంలో ఎన్ ఆర్ ఈ జి ఎస్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించి రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. బుధవారం
కాంట్రక్టర్ చక్రవర్తి నుండి రెండు లక్షలు డిమాండ్ చేసిన ఎంపిడిఓ సుభాష్ గౌడ్, ఇసి రఫి, ఎపిఓ నరసింహులు, టెక్నిక్ అసిస్టెంట్ లు రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నట్లు మీడియాకు తెలిపారు. ఈ దాడిలో 9 మంది చిక్కుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ అవినీతి కేసులో పరిగి మండలం ఎంపిడిఓ టీంలో మెత్తం 9మంది ఉన్నట్లు ఏసీబీ అధికారులు ఎంపిడిఓ, ఏపిఓ, 6 గురు టెక్నీకల్ అసిస్టెంట్లు ఉన్నట్లు తెలిపారు. కాగా చక్రవర్తి ఫోరమ్ ఫర్ ఆర్ టి ఐ సంగారెడ్డి జిల్లాఅధ్యక్షుడిగా పనిజేస్తున్నారు. ఆదినుండి అవినీతిపై పోరాటం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఆ క్రమం లోనే చక్రవర్తి అడుగువేసి విజయం సాధించారు. అవినీతిపై చక్రవర్తి చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నట్లు ఫోరమ్ ఫర్ ఆర్ టి ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదాల అబ్బులు, ఎఫ్ ఆర్ టి ఐ నాయకుడు వీరేశంలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

నాలుగు రోజులు తీవ్ర వడగాలులు..

Thu Apr 1 , 2021
అమరావతి, విశాఖ: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని. ప్రజలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావారణ శాఖ కార్యాలయంలో గురువారం ప్రత్యేకంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ శాఖ డైరక్టర్‌ ఎస్‌. స్టెల్లా ఈ విషయం తెలిపారు. . దక్షిణ అండమాన్‌ సముద్రంలో నెలకొన్న తుఫాన్‌ ప్రభావం కారణంగా వాతావరణంలో పలు మార్పులు జరుగుతున్నాయని చెప్పారు. దీనిలో భాగంగానే ఉత్తర దిశ నుండి […]

Translate

Translate »