అంబేద్కర్‌ విగ్రహం తొలగింపునకు యత్నం.. అడ్డుకున్న దళితులు!

ప్రకాశం (కొండపి) : కొండపి మండలం మిట్టపాలెంలోని ఎస్‌సి కాలనీలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని తొలగించేందుకు తమ సిబ్బందితో వచ్చిన రెవెన్యూ, పోలీసు అధికారులు శనివారం దళితులు అడ్డుకున్నారు. జాతీయ నాయకుని విగ్రహాన్ని తొలగించడానికి వీళ్లేదంటూ అడ్డగించడంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ విషయమై స్థానిక తహశీల్దార్‌, ఎస్సైలను వివరణ అడుగగా.. బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన స్థలం ప్రభుత్వ భూమి అని, అదే కాలనీకి చెందిన మైనం నాగభూషణం అనే వ్యక్తి.. విగ్రహం తమ ఇంటికి అడ్డుగా ఉందని, అనుమతి లేకుండా ఏర్పాటు చేశారని 2019లో హైకోర్టులో కేసు వేశాడని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల అమలు మేరకు ఇక్కడకు రావడంతో గ్రామస్తులు అధికసంఖ్యలో వచ్చి విగ్రహ తొలగింపును అడ్డుకున్నారని తెలిపారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

సామర్లకోట మున్సిపాల్టీలో సామాజిక మార్పు

Mon Mar 29 , 2021
బి బి  ఆర్ కె రావు,సామర్లకోట అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం, ఇటీవల జరిగిన  సామర్లకోట మున్సిపల్ ఎన్నికలలో   కొంత వరకు  సామాజిక మార్పు వచ్చిందని చెప్పవచ్చు.  రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సామర్లకోట పంచాయితీ ఏర్పడిన నుండి అగ్రకుల  సూద్రులైన కమ్మ సామాజిక వర్గం వారే నాయకత్వం వహించేవారు. మరో అగ్రకుల (మధ్య)  సూద్రులైన  కాపు సామాజిక వర్గం వారు సామర్లకోటలో మిగిలిన అన్ని కులాలు కన్నా […]

Translate

Translate »