అంబేడ్కర్ స్టడీ సర్కిల్ సిబ్బందిని తొలగించడం అన్యాయం

మంత్రి విశ్వరూప్ కి కెవిపి ఎస్ వినతి పత్రం

అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ సెంటర్ లో 16 సంవత్సరాలు నుంచి పని చేస్తున్న సిబ్బందిని అక్రమంగా తొలగించడం అన్యాయమని వారిని కొనసాగించాలని కెవీపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి విజ్ఞప్తి చేసారు. వారికి వెంటనే జీతాలు ఇవ్వాలని, ఎస్సీ కమీషన్ చైర్మన్, సభ్యులను నియమించాలని, జుడిషియల్ పవర్స్ ఇవ్వాలని బుధవారం సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు పినిపే విశ్వరూప్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. దళితుల సమస్యలపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం హైపవర్ కమిటీ సమావేశంలో చర్చ నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రికి విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ ని కలిసిన వారిలో డాక్టర్ పివి రత్నం, రామకృష్ణ, భాస్కర్, రాజేంద్ర, శ్రీనివాసరావు, ఆదాం, పార్వతి, భవాని తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మున్సిపల్ పన్ను విధింపుపై భక్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోండి!

Fri Mar 26 , 2021
👉 మస్జిద్ ఏ బిలాల్ మనోభావాలకు సంబంధించినది👉 కమిషనర్ తో ఫోన్లో మాట్లాడిన మంత్రి కొడాలి నాని గుడివాడ : మున్సిపల్ పన్ను విధింపుపై భక్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) అన్నారు . శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని బంటుమిల్లి రోడ్డులోని మస్జిద్ ఏ బిలాల్ […]

Translate

Translate »