ముక్కు ద్వారా కోవిడ్-19 వ్యాక్సిన్.. కరోనాకు ‘చుక్క’లే! ఒక్క డోసుతో సరి

రోనా వైరస్ ఇండియా నుంచి పూర్తిగా తొలగిపోలేదు. అది ఒకరి నుంచి మరొకరి వ్యాపించకుండా అరికట్టాలంటే.. వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే వ్యాక్సిన్ ప్రక్రియ మొదలుపెట్టింది. ముందుగా దీన్ని వైద్యులు, హెల్త్ వర్కర్లు, అత్యవసర సేవలు అందించే సిబ్బందికి అందిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్ రూపొందించిన ‘కొవాగ్జిన్’ కరోనా టీకాకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. అలాగే ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకాలు అభివృద్ధి చేసిన ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్‌కు కూడా భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) అనుమతి లభించింది. అయితే, ఈ టీకాలను సిరంజీ ద్వారా అందిస్తున్నారు. దీన్ని రెండు డోసులుగా తీసుకోవాలి. మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాలి. అయితే, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ తయారు చేస్తున్న నసల్ స్ప్రే వ్యాక్సిన్‌(Nasal Spray Vaccine)ను ఒక్కసారి తీసుకుంటే చాలట. పైగా, దాన్ని సిరంజీ ద్వారా తీసుకోవల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

99.9 శాతం వైరస్ సక్సెస్: ముక్కు ద్వారా అందించే ఈ నసల్ స్ప్రే వ్యాక్సిన్‌(BBV154) అందుబాటులోకి రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. అయితే, ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. ఒక్క డోసుతోనే కరోనాకు ‘చుక్కలు’ చూపించవచ్చు. నోటిలో వేసే పోలీయో చుక్కలు తరహాలోనే ఈ వ్యాక్సిన్‌ను ముక్కు పుటల్లో వేస్తారు. ఈ చుక్కలు కరోనా వైరస్‌ను 99.9 శాతం చంపేయగలవని ఇంగ్లాండ్‌లోని సర్రే కౌంటీలోని ఆశ్పార్డ్, సెయింట్ పీటర్స్ హాస్పిటల్స్, ఎన్‌హెచ్‌ఎస్ ట్రస్ట్ నిర్వహించిన ట్రైల్స్‌ ద్వారా పరిశోధకులు తెలుసుకున్నారు.

హైదరాబాద్‌లోనే ప్రయోగాలు: ముక్కు ద్వారా తీసుకునే ఈ వ్యాక్సిన్ కోసం కేవలం ఇండియాలోనే కాకుండా.. అమెరికా, కెనడా, యూకే దేశాల్లో కూడా ఈ నసల్ స్ప్రే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఆయా దేశాల కంటే ముందుగానే ఇండియాలో నసల్ స్ప్రే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేఅవకాశాలు కనిపిస్తున్నాయి. దీని తయారీ కోసం ఇప్పటికే సెయింట్‌ లూయిస్‌లోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌తో భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది.
అలర్ట్.. కరోనా వ్యాక్సిన్‌కు ముందు, తర్వాత మద్యం తాగొద్దు: నిపుణులుసులభమైనది.. సమర్థవంతమైనది: ఈ వ్యాక్సిన్‌పై ఇండియా, అమెరికాల్లో నిర్వహించిన ప్రీ-క్లినికల్ ప్రయోగాలు విజయవంతమైన నేపథ్యంలో వీలైనంత త్వరలోనే ప్రజలు నొప్పిలేని వ్యాక్సిన్‌ను పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సిరంజీ ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ కంటే మెరుగ్గా ఈ నసల్ స్ప్రే పనిచేస్తుందని పరిశోధకులు తెలుపుతున్నారు. దీన్ని చాలా సులభంగా ముక్కులోకి స్ప్రే చేసుకోవచ్చని, ఇది వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా శరీరంలోని రోగ నిరోధక శక్తిని సైతం పెంపొందిస్తుదని పేర్కొంటున్నారు.
కరోనా వైరస్.. దగ్గు, జ్వరానికి ముందే ఈ 4 లక్షణాలు కనిపిస్తాయిప్రజలే స్వయంగా తీసుకోవచ్చు: మరోవైపు కెనడా సైతం ఈ వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే నసల్ స్ప్రే వ్యాక్సిన్‌కు సంబంధించి ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. వాంకోవర్ సానోటైజ్ (SaNOtize) రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆద్వర్యంలో ఎలుకలపై చేసిన ప్రయోగంలో ఈ వ్యాక్సిన్ 95 శాతం సత్ఫలితాలు చూపాయి. పైగా ఈ వ్యాక్సిన్ వేసేందుకు ప్రత్యేకంగా హెల్త్ వర్కర్లతో పని ఉండదు. ప్రజలే స్వయంగా తీసుకోవచ్చు. కాబట్టి.. వీలైనంత త్వరగా ముక్కులో వేసుకొనే ఈ నసల్ స్ప్రే వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలని కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కాకినాడ కార్పొరేటర్ కంపర రమేష్ దారుణ హత్య

Fri Feb 12 , 2021
.. కారుతో ఢీ కొట్టి హత్య చేసిన సంఘటన.. పాత కక్షల నేపథ్యంలో హత్య కాకినాడ: కాకినాడలో కార్పొరేటర్ దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్ధులు కారుతో కార్పొరేటర్ కంప రమేష్ ను ఢీకొట్టి హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారంకాకినాడ రూరల్ వలస పాకలో వద్ద నాలుగో వార్డ్ కార్పొరేటర్ కంపర రమేష్ తన స్నేహితులతో పార్టీ చేసుకుంటున్నారు.రెవెన్యూ కాలనీకి చెందిన చిన్న రమేష్ కి […]

Translate

Translate »