తప్పుడు వైద్యంతోనే కరోనాలో మార్పులు: ఐసీఎంఆర్

​అలాంటి చికిత్సల వల్లే వైరస్‌పై రోగనిరోధక ఒత్తిడి

బ్రిటన్ స్ట్రెయిన్ అలా ఏర్పడిందే!

చాలా దేశాలకు ‘బ్రిటన్ కరోనా’ పాకేసింది. మన దేశానికీ అది వచ్చేసింది. దానితో ఎక్కువ ప్రమాదం లేదని ప్రభుత్వం, నిపుణులు చెబుతున్నా.. అది సోకే వేగమే ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. అయితే, వైరస్‌లో ఇలాంటి జన్యుమార్పులకు కారణం తప్పుడు వైద్యమేనని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) హెచ్చరిస్తోంది.

ప్రస్తుతం కొవిడ్‌కు సంబంధించినంత వరకు తప్పుడు వైద్యం వల్లే వైరస్ జన్యు పరంగా ఉత్పరివర్తనం చెందుతోందని, లేని చికిత్సలు చేయడం వల్లే మార్పులు జరుగుతున్నాయని, బ్రిటన్ కరోనా స్ట్రెయిన్ కూడా అలా వచ్చిందేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ చెప్పారు. మామూలుగా వైరస్‌లో మార్పులు జరుగుతూనే ఉంటాయని, కానీ, బ్రిటన్ వైరస్ విషయంలో మాత్రం వేగంగా వ్యాపించడమే కలవరపెడుతోందని అన్నారు. తప్పుడు చికిత్సలతో వైరస్ మీద రోగనిరోధక ఒత్తిడి పెరగడం వల్లే మార్పులు జరుగుతున్నాయన్నారు.

వాతావరణ పరిస్థితులే మహమ్మారిలో ఉత్పరివర్తనాలకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నా.. శాస్త్రీయత లేని వైద్యం చేసి వైరస్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా మార్పులు జరుగుతాయన్నారు. వైద్యులు, శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

టీకాతో కరోనా రోగనిరోధకశక్తి పెరుగుతుందని, కాబట్టి వ్యాక్సినేషన్‌ను కొంచెం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని చెప్పారు. కరోనాకు ప్రస్తుతం తయారు చేస్తున్న వ్యాక్సిన్లన్నీ వైరస్‌లోని ఎస్ ప్రొటీన్‌ను లక్ష్యంగా పనిచేసేవనని, కొన్ని ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లూ ఉన్నాయని చెప్పారు. అవన్నీ ప్రస్తుతానికి వైరస్ మీద బాగానే పనిచేస్తున్నాయని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

జనవరి ఒకటవ తేదీని మూలవాసుల శౌర్య దినోత్సవంగా జరుపుదాం: ఎఐడిఅర్ఎఫ్

Wed Dec 30 , 2020
జనవరి ఒకటవ తేదీన శౌర్య దివస్ సందర్భంగా ప్రత్యేకంగా వ్రాస్తున్న వ్యాసము ప్రతి సంవత్సరం జనవరి 1న “భీమా- కోరేగావ్” శౌర్య దినోత్సవ వేడుకను (విజయ్ దివస్) డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎంతో విశిష్టంగా, ఘనంగా, శ్రద్దతో నిర్వహించేవారు. మరుగు చేయబడ్డ మూలవాసుల చరిత్రను తెలియజేస్తూ, అజ్ఞానంతో వున్న మన సమాజాన్ని మేల్కొలిపి, సంఘటిత పరచడానికి ఎన్నో కార్యక్రమాలను బాబాసాహెబ్ అంబేడ్కర్ నిర్వహించారు. సంవత్సారాది ఉగాది మన పండగ కాదు. […]

Translate

Translate »