టీడీపీ ఎమ్మెల్సీకి మరోసారి కరోనా.. పరిస్థితి విషమం..!

అమరావతి: ఏపీలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుతున్నాయి. మొదట్లో ప్రజలు, నాయకులు కరోనా పట్ల పలు జాగ్రత్తలు పాటించినప్పటికి ఇప్పుడు కాస్త నిర్లక్ష్యంగా ఉండడంతో మళ్ళీ కొందరు రెండో సారి కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు రెండోసారి కరోనా బారిన పడ్డారు. కొద్దిరోజుల క్రితం ఆయనకు కరోనా రావడంతో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.

అప్పుడు కరోనా నెగెటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే మళ్ళీ ఇప్పుడు బచ్చుల అర్జునుడుకి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఎఫ్ ఆర్ టి ఐ జిల్లా మహాసభ ఆహ్వాన కమిటీ అధ్యక్షుడిగా పిచ్చయ్య

Fri Dec 4 , 2020
గుంటూరు: ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ గుంటూరు జిల్లా మహాసభ ఏర్పాటు నిమిత్తం శనివారం సాయంత్రం గుంటూరు పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశానికి రమణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతిపాడు చంద్రమోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్ట ప్రసాద్ హాజరయ్యారు.ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా పేద ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో,మరియు ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ చేపడుతున్న కార్యక్రమాల గురించి […]

Translate

Translate »