భారీ వర్షాలు, వరదలు, తుఫానులలో ‘తూర్పు’ కు రూ.2,442 కోట్లు నష్టం | కేంద్ర బృందానికి కలెక్టర్ వివరణ

  కాకినాడ:గత ఆగష్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలో సంభవించిన వరదలు, భారీ వర్షాల కారణంగా జిల్లాలో వివిధ రంగాలకు  2,442 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి  కేంద్ర పరిశీలన బృందానికి తెలియజేశారు.ఇటీవల సంభవించిన వరుస ప్రకృతి విపత్తుల వల్ల జిల్లాలో జరిగిన నష్టాల పరీశీలనకు మంగళవారం జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రిత్వశాఖల అధికారుల ప్రత్యేక బృందం మద్యాహ్నం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో జిల్లా అధికారులతో సమావేశమై వివిధ శాఖల వారీగా నష్టాలను సమీక్షించింది. కేంద్ర హోమ్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సౌరవ్ రే నేతృత్వంలో రూరల్ డవలెప్మెంట్ అసిస్టెంట్ కమీషనర్ ఆయుష్ పునియా, రోడ్డు ట్రాన్స్ పోర్టు, హైవే మంత్రిత్వశాఖ ఎస్ఈ శ్రవణ్ కుమార్ సింగ్, ఆర్థిక మంత్రిత్వశాఖ కన్సల్టెంట్ ఆర్.బి.కౌల్ లతో కూడిన నలుగురు సభ్యుల బృందం ఈ పర్యటనలో పాల్గొంది.  ఇందులో భాగంగా తొలుత కలెక్టరేట్ స్పందన హాలులో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గత ఆగష్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో సంభవించిన ప్రకృతి విపత్తుల సందర్భంగా జరిగిన నష్టాలను జిల్లా కలెక్టర్ డి.మురళీధరెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆగష్టు నెలలో సంభవించిన గోదావరి వరదలు, సెప్టెంబరు నెలలో కురిసిన భారీ వర్షాలు, అక్టోబరు నెలలో తుఫాను కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు 422 కోట్ల 60 లక్షల మేరకు, మౌళిక సదుపాయాలకు 2,019 కోట్ల 44 లక్షలు, వెరసి మొత్తం 2,442 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని వివరించారు. రంగాల వారిగా జరిగిన  నష్టాలను ఆయన ఈ విధంగా తెలియజేశారు.  For more details login to www.waradhi.net

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ట్రైకార్ నిధులు దుర్వినియోగం కాకుండా చూడండి!

Wed Nov 11 , 2020
• మరింత మంది యువతకు ఉపాధి కల్పించండి• అల్లూరి, లంబసింగి మ్యూజియంల నిర్మాణం వేగవంతం చేయండిఅమరావతి: ట్రైకార్ ద్వారా గిరిజన సంక్షేమానికి వినియోగించే నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని, పథకాల అమలులో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయాన్ని తగ్గించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి కోరారు. గిరిజన యువతకు మరింతగా ఉపాధి కల్పించే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో గిరిజన నిరుద్యోగుల పేరిట ఇచ్చిన ఇన్నోవా […]

Translate

Translate »